Girl Missing : గర్ల్ మిస్సింగ్.. సినిమా స్టోరీకి సరిపోయే ట్విస్ట్ ఇది-shocking twist in girl missing incident in guntur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Shocking Twist In Girl Missing Incident In Guntur District

Girl Missing : గర్ల్ మిస్సింగ్.. సినిమా స్టోరీకి సరిపోయే ట్విస్ట్ ఇది

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 12:07 AM IST

Guntur News : గుంటూరు జిల్లాలో ఓ యువకుడితో వచ్చిన యువతి పరారైంది. పోలీసులు ప్రశ్నించగా ఏవేవో సమాధానాలు చెప్పాడు. కానీ సడెన్ గా యువతి ట్విస్ట్ ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఐదేళ్ల నుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు. బైక్ మీద వస్తుంటే.. పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. కానీ యువకుడు ఎందుకో పెద్దగా ఆసక్తిగా మాట్లాడలేదు. ఇక అక్కడ నుంచి యువతి మిస్ అయింది. పోలీసులకు విషయం తెలిసింది. యువకుడే చంపేశాడా? లేదా ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనేలా పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. గుంటూరు(Guntur) జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

ఈపూరు మండలం ఇనిమెళ్లకు చెందిన యువకుడు, రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డి పాలెం గ్రామానికి చెందిన యువతి ఐదు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరూ బైక్(Bike) మీద వస్తున్నారు. తుంగపాడు(Tungapadu) వద్దకు వచ్చారు. అక్కడ పెళ్లి ప్రస్తావన వచ్చింది. బైక్ దిగిన యువతి.. పెళ్లి చేసుకోవాలని అడిగింది. నెమ్మదిగానే మెుదలైన మాటలు.. కాసేపటికి వాగ్వాదానికి దారితీశాయి.

ఇద్దరి మధ్య గొడవ పెద్దగా అవుతున్న సమయంలో యువతి సుబాబుల్ తోటలోకి పరుగెత్తింది. అయితే మళ్లీ వస్తుందనుకున్నాడు యువకుడు. కానీ రాకపోయేసరికి వెళ్లి వెతికాడు. ఆమె ఆచూకీ అస్సలు కనిపించలేదు. దీంతో యువకుడు భయపడ్డాడు. స్థానికులతో ఎవరో కొందరు అమ్మాయిని తోటలోకి లాక్కెళ్లారని చెప్పాడు. వారు పోలీసు(Police)లకు చెప్పారు.

నరసరావుపేట(Narasaraopeta) డీఎస్పీ విజయభాస్కర్, రూరల్‌ సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్‌ఐ సురేష్‌బాబు సిబ్బందితోపాటు ఘటనా స్థలానికి చేరుకుని.. సుబాబుల్ తోటలో వెతికారు. కానీ యువతి కనిపించలేదు. ఇలా వెతుకుతున్న సమయంలోనే యువకుడు తానే యువతిని హత్య చేశానని చెప్పాడు. మృతదేహం కోసం.. కూడా వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. యువకుడి సమాధానాలు మాత్రం పొంతన లేకుండా ఉన్నాయి.

దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా అడిగేసరికి.. నిజం చెప్పేశాడు యువకుడు. తన కోసం సుబాబుల్ తోటలో పోలీసులు, తన ప్రియుడు వెతుకుతున్నారని యువతికి తెలిసింది. డీఎస్పీ(DSP)కి ఫోన్ చేసి.. తాను సేఫ్ గా ఉన్నట్టుగా తెలిపింది. పోలీస్ స్టేషన్ కు తానే వస్తానని చెప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వచ్చి తోట దగ్గర జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ చెప్పారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిచిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో కథ సుఖాంతమైంది.

IPL_Entry_Point