ఏపీలో మహిళల భద్రత కోసం అందుబాటులోకి శక్తి వాట్సాప్ నంబర్‌ 79934 85111-shakti whatsapp number launched for womens safety in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో మహిళల భద్రత కోసం అందుబాటులోకి శక్తి వాట్సాప్ నంబర్‌ 79934 85111

ఏపీలో మహిళల భద్రత కోసం అందుబాటులోకి శక్తి వాట్సాప్ నంబర్‌ 79934 85111

Sarath Chandra.B HT Telugu

ఏపీలో మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. వాట్సాప్‌ భాగస్వామ్యంతో అత్యవసర సమయాల్లో మహిళలు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్‌ కాల్‌, సాధారణ ఫోన్‌ కాల్‌ చేసినా బాధితులను వేగంగా గుర్తించి శక్తి టీమ్స్‌ సాయం చేస్తాయి.

మహిళల భద్రత కోసం శక్తి వాట్సాప్‌ నంబర్‌ ప్రవేశపెట్టిన పోలీసులు

ఏపీలో మహిళల భద్రత కోసం "శక్తి వాట్సప్ నంబర్"ను ఏపీ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర సమయాల్లో కాల్‌ చేసినా, మెసేజ్ చేసినా స్పందించేలా వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

మహిళలు అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి వాట్సాప్‌ నంబర్‌ 79934 85111 ను డీజీపీ హరీష్ గుప్తా మంగళవారం ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భాగస్వామ్యంలో ఈ సేవల్ని ప్రారంభించారు.

ఏపీ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం తీసుకొచ్చిన “శక్తి” యాప్‌కు ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఈ క్రమంలో మహిళల భద్రత కోసంఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఆధ్వర్యంలో శక్తి వాట్సప్ నంబర్ 79934 85111 అందుబాటులోకి తీసుకు వచ్చారు.

మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శక్తి వాట్సప్ నంబర్ ను ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సప్ నంబరుకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకుంటాయని చెప్పారు.

24/7 శక్తి వాట్సాప్‌ నంబర్ అందుబాటులో ఉంటుందని డీజీపీ వివరించారు. సాంకేతికత సహాయంతో మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు ఈ నంబర్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలు విధిగా తమ మొబైల్ లో శక్తి వాట్సప్ నంబర్ ను సేవ్ చేసుకోవాలరి ఐజీ రాజకుమారి కోరారు. ఈ కార్యక్రమంలో "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీపీ రాజకుమారి, ఎస్పీ శ్రీదేవి రావు తదితరులు పాల్గొన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం