కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఏపీఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హోస్కోట సమీపంలో గొట్టిపుర గేట్ వద్ద లారీని ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు వదిలినట్లు తెలిసింది.వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను హోస్కోటలోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించారు.
ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే ప్రమాదంలో బస్సు(AP 03 Z0190) ప్రమాదానికి గురైనట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న హోస్కోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.