వైజాగ్ నేవీ బేస్ లో గన్ ఫైర్...! సెంట్రీ గార్డ్ మృతి-sentry dies of gunshot at ins kalinga base near vizag police suspect suicide ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వైజాగ్ నేవీ బేస్ లో గన్ ఫైర్...! సెంట్రీ గార్డ్ మృతి

వైజాగ్ నేవీ బేస్ లో గన్ ఫైర్...! సెంట్రీ గార్డ్ మృతి

వైజాగ్ సమీపంలోని ఐఎన్ఎస్ కళింగ నౌకాదళ ప్రాంగణంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటన సెంట్రీ గార్డ్ బాజీ షేక్ (45) మృతి చెందాడు. అయితే గన్ మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

సెంట్రీ గార్డ్ మృతి...!representative image (image pixel )

విశాఖపట్నం సమీపంలోని ఐఎన్ఎస్ కళింగ ప్రాంగణంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో సెంట్రీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల బాజీ బాబా షేక్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇది ఆత్మహత్య…? లేదా గన్ మిస్ ఫైర్ అయిందా..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై ఓ అధికారి పీటీఐతో మాట్లాడారు. “అతను సెంట్రీ విధుల్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. తుపాకీ కాల్పుల గాయంతో మరణించాడు. ఇది ఆత్మహత్యా…? లేదా గన్ మిస్ ఫైర్ అయిందా…? అనేది ఇంకా తేలలేదు” అని చెప్పారు.

“ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది” అని సదరు అధికారి వివరించారు.

ఈ మృతిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బాజీ షేక్ గుంటూరుకు చెందిన వ్యక్తిగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం