AP Assembly Protem Speaker : అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల - ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్-senior tdp mla gorantla butchaiah chowdary sworn in as protem speaker at ap raj bhavan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Protem Speaker : అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల - ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్

AP Assembly Protem Speaker : అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల - ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 20, 2024 07:19 PM IST

AP Protem Speaker Gorantla Butchaiah Chowdary : ఏపీ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమితులయ్యారు. ఆయనతో గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

AP Protem Speaker Gorantla Butchaiah Chowdary : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమితులయ్యారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి… రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్ గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఈ సందర్భంగా ప్రోటెం స్పీకర్ గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

గవర్నర్ చేత ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియామక పత్రాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ పిపికె. రామాచార్యులు సభలో చదివి వినిపించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీజే భరత్, సవిత, ఎం.రాం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్లకు పలువురు అభినందనలు తెలిపారు.

రేపట్నుంచే సమావేశాలు….

రేపట్నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ హోదాలో అసెంబ్లీ వేదికగా గెలిచిన ఎమ్మెల్యేలతో గోరంట్ల  ప్రమాణం చేయిస్తారు. ఉదయం 9.46 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది.ఈ సమావేశాలు 2 రోజుల పాటు సాగనున్నాయి.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరందరితోనూ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించననున్నారు.

గత సభలో 151 సభ్యులతో ఉన్న వైసీపీ ఈసారి 11కే పరిమితం అయ్యింది. వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా జగన్ అసెంబ్లీ వస్తారా? అనేది చర్చగా మారింది. అందరు ఎమ్మెల్యేలతో కలిసి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా స్పీకర్ ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ తన సత్తా చాటుకుంటూనే వస్తోంది. తొలిసారిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ… ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకుంది. ఆ పార్టీ అధినేతగా ఉన్న జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఇక 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాల్లో గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది.

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది. 21 స్థానాలను గెలిచి…. ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోయే స్థానాలను సంపాదించింది. అయితే జనసేన ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. దీంతో ప్రతిపక్ష నేత లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగున్నాయి.

 

WhatsApp channel