SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... మచిలీపట్నం - కర్నూలు మధ్య ప్రత్యేక రైళ్లు -scr extends special trains between machilipatnam and kurnool city
Telugu News  /  Andhra Pradesh  /  Scr Extends Special Trains Between Machilipatnam And Kurnool City
ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... మచిలీపట్నం - కర్నూలు మధ్య ప్రత్యేక రైళ్లు

29 March 2023, 15:06 ISTHT Telugu Desk
29 March 2023, 15:06 IST

South Central Railway Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్ని సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నం - కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఆయా వివరాలు చూస్తే…..

Machilipatnam Kurnool City Special Trains: మచిలీపట్నం - కర్నూల్ సిటీ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. మచిలీపట్నం - కర్నూల్ సిటీ (ట్రైన్ నెంబర్ 07067) మధ్య ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ప్రత్యేక రైలును నడపనున్నారు. శని, మంగళ, గురువారం రోజుల్లో నడుస్తాయి. ఇక కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం(ట్రైన్ నెంబర్ 07068) మధ్య ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు స్పెషల్ ట్రైన్ నడుపుతారు. ఈ ప్రత్యేక రైలు... ఆదివారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.

ఆగే స్టేషన్లు ఇవే...

ఈ ప్రత్యేక రైళ్లు.... గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దోనకొండ, మర్కాపూర్, గిద్దలూరు, డోన్ రైల్వేస్ఠేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లలో ఏసీీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని పేర్కొంది. ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరింది.

పాక్షికంగా రద్దు…

ఇక పందర్ పూర్ - నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మార్చి, 31, ఏప్రిల్ 1వ తేదీల్లో సేవలను రద్దు చేసింది. ఇందులో భాగంగా నాందేడ్ - నిజామాబాద్ మధ్య సేవలు పాక్షికంగా రద్దు అవుతాయని పేర్కొంది.

Vande Bharat Trains: మరోవైపు రైళ్లపై రాళ్లు విసరడం, అద్దాలు పగుల గొట్టడం వంటి చర్యలకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్షలు తప్పవని రైల్వే అధికారులు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువ కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసరడం వంటి పనులు చేస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెచ్చరించారు.

ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ఇలాంటి ఘటనలపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు . ఇటీవలి కాలంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతుండటంపై రైల్వే అధికారులు నిఘా పెంచారు. రైళ్లపై జరుగుతున్న దాడుల్ని నియంత్రించేందుకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జనవరి నుంచి ఇప్పటివరకు రైలు బోగీలపై రాళ్లు విసిరిన 9 ఘటనలు జరిగాయని, ఈ ఘటనల్లో 39 మందిని అరెస్టుచేసి జైలుకు పంపామని పేర్కొంది. ఈ దాడుల్లో అయిదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రైల్వే ట్రాక్‌ల పక్కన నిలబడి ఆకతాయితనంతో ఈ దాడులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి చర్యల్ని ఊపేక్షించేది లేదని, రైలు ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత కథనం