Summer Special Trains : ఏపీ మీదుగా కన్యాకుమారికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - ఇవిగో వివరాలు
SCR Summer Special Trains : వేసవి వేళ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లి స్టేషన్ నుంచి కన్యాకుమారికి 26 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్స్ ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మరికొన్ని అప్డేట్స్ ఇక్కడ చూడండి….
ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఏపీలోని పలు పట్టణాల మీదుగా స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను పేర్కొంది. ఈ రైళ్లు చర్లపల్లి నుంచి ఏపీలోని వివిధ రైల్వే స్టేషన్ల మీదుగా కన్యాకుమారికి రాకపోకల నిర్వహిస్తాయి. అలాగే మరో ఎనిమిది స్పెషల్ రైళ్లను పొడిగించారు.
సమ్మర్ స్పెషల్ ట్రైన్స్….
చర్లపల్లి-కన్యాకుమారి సమ్మర్ స్పెషల్ ట్రైన్ (07230) ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.50 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటలకు కన్యకుమారి చేరుకుంటుంది.
కన్యకుమారి-చర్లపల్లి సమ్మర్ స్పెషల్ (07229) ట్రైన్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం ఉదయం 5.15 గంటలకు కన్యకుమారిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు శనివారం ఉదయం 11.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రైళ్లు చర్లపల్లి-కన్యకుమారి మధ్య నల్లొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణుగుంట తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
పలు స్పెషల్ రైళ్లను పొడిగింపు:
1. తిరుపతి-వికారాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07481) రైలు సర్వీసును ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు పొడిగించారు.
2. వికారాబాద్-తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును (07482) రైలు సర్వీసును ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు పొడిగించారు.
3. తిరుపతి-అకోలా స్పెషల్ రైలు (07605) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు పొడిగించారు.
4. అకోలా-తిరుపతి స్పెషల్ రైలును (07606) ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు పొడిగించారు.
5. పూర్ణ-తిరుపతి స్పెషల్ రైలును (07609) ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు పొడిగించారు.
6. తిరుపతి-పూర్ణ స్పెషల్ రైలును (07610) ఏప్రిల్ 8 నుంచి జూలై 7 వరకు పొడిగించారు.
7. కాకినాడ టౌన్-లింగంపల్లి స్పెషల్ రైలును (07445) ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు పొడిగించారు.
8. లింగంపల్లి-కాకినాడ టౌన్ స్పెషల్ రైలును (07446) ను ఏప్రిల్ 3 నుంచి జూలై 1 వరకు పొడిగించారు.
ఎనిమిది రైళ్లు రద్దు:
సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈనెల 23 నుంచి 25 వరకు పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఆ వివరాలు కింద విధంగా ఉన్నాయి….
1. కాకినాడ పోర్టు-విశాఖపట్నం (17267) మెము రైలు మార్చి 24న రద్దు చేశారు.
2. విశాఖపట్నం-కాకినాడ పోర్టు (17268) మెము రైలు మార్చి 24న రద్దు.
3. రాజమండ్రి-విశాఖపట్నం (67285) మెము రైలు మార్చి 24న రద్దు
4. విశాఖపట్నం-రాజమండ్రి (67286) మెము రైలు మార్చి 24న రద్దు
5. విశాఖపట్నం-గుంటూరు (22875) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 24న రద్దు
6. గుంటూరు-విశాఖపట్నం (22876) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 24న రద్దు
7. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 23, 24 తేదీల్లో రద్దు
8. విశాఖపట్నం-గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 24, 25 తేదీల్లో రద్దు
పలు రైళ్లు దారిమళ్లింపు:
పలు రైళ్లను దారి మళ్లిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-బేగంపేట కాకుండా అమ్ముగూడ బైపాస్ మార్గంలో చర్లపల్లి - సనత్‌నగర్, లింగంపల్లి మీదుగా మళ్లించారు. మరో నాలుగు రైళ్లను సికింద్రాబాద్ నుండి చర్లపల్లి మీదుగా రైళ్ల మళ్లించారు.ఆ వివరాలు చూస్తే…..
1. విశాఖపట్నం-ఎల్‌టీటీ ముంబాయి ఎక్స్‌ప్రెస్ (18519) రైలు
2. ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18520)
3. కాకినాడ పోర్టు-సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17206)
4. సాయినగర్ షిర్డీ-కాకినాడ పోర్టు వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17205)
5. మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17208)
6. సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17207)
7. విశాఖపట్నం-సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18503)(చర్లపల్లి మీదుగా)
8. సాయినగర్ షిర్డీ-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18504)(చర్లపల్లి మీదుగా)
9. విశాఖపట్నం-నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (20811)(చర్లపల్లి మీదుగా)
10. నాండేడ్-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (20812)(చర్లపల్లి మీదుగా)