RTC Drivers : బస్ డ్రైవర్లుగా ఎస్సీ మహిళలు.. వాహనాల కొనుగోలు రుణాలు పెంపు-sc women to be trained and recruited as rtc drivers in andhra pradesh know in details inside ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Sc Women To Be Trained And Recruited As Rtc Drivers In Andhra Pradesh Know In Details Inside

RTC Drivers : బస్ డ్రైవర్లుగా ఎస్సీ మహిళలు.. వాహనాల కొనుగోలు రుణాలు పెంపు

HT Telugu Desk HT Telugu
Jun 30, 2022 04:21 PM IST

ఆర్టీసీ ద్వారా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారికి డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్టుగా తెలిపారు.

మంత్రి నాగర్జున
మంత్రి నాగర్జున

ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి మేరుగ నాగార్జున నిర్వహించిన సమీక్షా నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. ఎస్సీ మహిళలకు శిక్షణ అనంతరం ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల సౌజన్యంతో నర్సింగ్‌ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

'భారీ కోసం ఇచ్చే రుణ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలి. ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం కింద విదేశాల్లో పీజీ చేసేవారికి రూ.20 లక్షలు, స్వదేశంలో పీజీ చేసే వారికి రూ.15 లక్షల వరకు రుణాలు అందిస్తాం.' అని మంత్రి నాగర్జున చెప్పారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్, గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, లిడ్‌క్యాప్‌ సీఎండీ డోలా శంకర్, ఎస్సీ కార్పొరేషన్‌ జీఎం కరుణకుమారి పాల్గొన్నారు.

అంతకుముందు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనులను వేధించకూడదని అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదని ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. తహశీల్దార్లు, ఎస్సైలు వారానికి ఓసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలని సూచనలు చేశారు.

ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో అతి తక్కువ శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడుతున్నాయని మంత్రి నాగర్జున వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలు ఏర్పడినందున అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసులను విచారించే డీఎస్పీలను నియమించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐడీ పీసీఆర్‌ ఎస్పీ రత్న, జేడీ ప్రాసిక్యూషన్‌ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్