Satyasai Crime : ఇంటిప‌క్క వ్యక్తితో వివాహేత‌ర సంబంధం, ప్రియుడితో కలిసి భ‌ర్తను హ‌త‌మార్చిన భార్య-satyasai wife killed husband questioned extramarital relation with another man ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Satyasai Crime : ఇంటిప‌క్క వ్యక్తితో వివాహేత‌ర సంబంధం, ప్రియుడితో కలిసి భ‌ర్తను హ‌త‌మార్చిన భార్య

Satyasai Crime : ఇంటిప‌క్క వ్యక్తితో వివాహేత‌ర సంబంధం, ప్రియుడితో కలిసి భ‌ర్తను హ‌త‌మార్చిన భార్య

HT Telugu Desk HT Telugu
Jan 21, 2025 08:53 PM IST

Satyasai Crime : సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఇంటిపక్కనే కూరగాయలమ్మే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ...ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంటిప‌క్క వ్యక్తితో వివాహేత‌ర సంబంధం, ప్రియుడితో కలిసి భ‌ర్తను హ‌త‌మార్చిన భార్య
ఇంటిప‌క్క వ్యక్తితో వివాహేత‌ర సంబంధం, ప్రియుడితో కలిసి భ‌ర్తను హ‌త‌మార్చిన భార్య

Satyasai Crime : శ్రీస‌త్యసాయి జిల్లాలో ఘోర‌మైన సంఘట‌న చోటు చేసుకుంది. ఇంటిప‌క్కనే కూర‌గాయ‌ల‌మ్మే వ్యక్తితో భార్య వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. దీంతో ప్రియుడితో క‌లిసి భ‌ర్తను భార్య హ‌త‌మార్చింది. వేకువజామున భ‌ర్త గాఢ‌నిద్రలో ఉన్న భ‌ర్తను ప్రియుడితో క‌లిసి గొంతుకు చున్నీచుట్టి, ఆపై గొంతు నులిమి హ‌త్య చేసింది. అనంత‌రం ఏమీ తెలియ‌న‌ట్లు భర్త చెల్లికి ఫోన్ చేసి, మీ అన్నయ్య నిద్ర నుంచి లేవ‌టం లేద‌ని చెబుతూ న‌టించింది. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచార‌ణ నిజానిజాలు వెల్లడ‌య్యాయి.

ఈ ఘ‌ట‌న శ్రీ‌స‌త్యసాయి జిల్లాలో హిందూపురంలోని ర‌హ‌మ‌త్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం హిందూపురంలోని ర‌హ‌మ‌త్‌పూర్‌కు చెందిన ఎస్‌.అల్లాబ‌కాష్‌కు క‌ర్ణాట‌క‌లోని దొడ్డబ‌ళ్లాపురానికి చెందిన త‌బ‌స్సుంతో తొమ్మిదేళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. ఎస్‌.అల్లాబ‌కాష్‌, తబ‌స్సుం దంప‌తుల‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అల్లబ‌కాష్ హిందూపురంలోనే ఆటోన‌గ‌ర్‌లో బీరువాల ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

భార్య త‌బ‌స్సుం ఇంటివ‌ద్దే ఉంటుంది. ఈ క్రమంలో ఇట్టిప‌క్కనే కూర‌గాయ‌లు అమ్మే న‌దీముల్లాతో ప‌రిచ‌యం ఏర్పడింది. ఈ ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. దీంతో భార్య వ్యవ‌హారం గురించి ఆనోటా ఈనోటా చ‌ర్చ జ‌రిగి, భ‌ర్త ఎస్‌.అల్లాబ‌కాష్ చెవిలో ప‌డింది. భార్య త‌బ‌స్సుంను భ‌ర్త నిల‌దీశాడు. దీంతో వారిమ‌ధ్య త‌ర‌చూ గొడ‌వులు జ‌రిగేవి. దీంతో ప్రియుడి వ్యామోహంలో త‌బ‌స్సుం, క‌ట్టుకున్న భ‌ర్తను అడ్డుతొల‌గించుకోవాల‌ని అనుకుంది. ప్రియుడితో ఈ విష‌యం చెప్పి, త‌న భ‌ర్తను హ‌త్య చేయాల‌ని కోరింది. ఈనెల 18న ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇంట్లో కుమారులు లేని స‌మయంలో భ‌ర్త గాఢ‌నిద్రలో ఉండ‌గా ప్రియుడితో క‌లిసి గొంతుకు చున్నీచుట్టి, ఆపై గొంతు నులిమి హ‌త్య చేసింది. అనంత‌రం ఏమీ తెలియ‌న‌ట్లు ప్రియుడు వెళ్లిపోయాడు. తబస్సుం కూడా ఏమీ జ‌ర‌గ‌న‌ట్లు ఇంట్లోనే ఉంది.

అయితే కొద్ది సేప‌టి త‌రువాత త‌బ‌స్సుం అల్లాబ‌కాష్ సోద‌రికి ఫోన్ చేసి, మీ అన్నయ్య ఎంత లేపినా లేవ‌టం లేద‌ని చెప్పింది. దీంతో వారు హుటాహుటినా ఇంటికి చేరుకున్నారు. వ‌చ్చి చూస్తే అప్పటికే అత‌ను చ‌నిపోయాడ‌ని గ్రహించారు. త‌బ‌స్సుంను ప్రశ్నించారు. త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని, తాను ఎంత లేపిన లేవ‌లేద‌ని అబద్ధం చెప్పింది. గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో అప్పుడు ప్రియుడితో క‌లిసి గొంతు నులిమి హ‌త్య చేసిన‌ట్లు త‌బ‌స్సుం ఒప్పుకుంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. దీంతో సోమ‌వారం మ‌ధ్యాహ్నం హిందూపురం ఆటోన‌గ‌ర్ వ‌ద్ద నిందితులు ఉన్నార‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. హిందూపురం సీఐ అబ్దుల్ క‌రీం మాట్లాడుతూ విచార‌ణ కొన‌సాగుతోంద‌ని, నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా న్యాయ‌మూర్తి రిమాండ్ విధించారని అన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం