Sugarcane field Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 50 ఎకరాలలో చెరుకు పంట కాలిబూడిద
Sugarcane field Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 50 ఎకరాలలో చెరుకు తోట దగ్దం అయ్యింది. చెరుకు తోటల పైగా వెళ్తున్న కరెంటు తీగలు, ఒకదానికి ఒకటి తగలడంతో, నిప్పులు చెరుకు పంటలో పడ్డాయని రైతులు తెలిపారు.
Sugarcane field Fire Accident : షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరగడంతో, చెరుకు తోటలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి రైతులకు భారీగా నష్టం జరిగింది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. చెరుకు తోటల పైగా వెళ్తున్న కరెంటు తీగలు, ఒకదానికి ఒకటి తగలడంతో, నిప్పులు చెరుకు పంటలో పడ్డాయని రైతులు తెలిపారు. చూస్తుండగానే, ఈ నిప్పులు, మంటలుగా మారటం, క్షణాల్లో పొలం మొత్తానికి వ్యాప్తి చెందాయి.

కోటి రూపాయల నష్టం
సుమారుగా 50 ఎకరాలలో చెరుకు తోటలు దగ్ధం కావడంతో రైతులకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం ఇప్పపల్లి గ్రామానికి చెందిన పెంటప్ప, సుభాష్, జైపాల్, ఎండి జబ్బర్, ఎండీ షఫీ, ఎండీ జమీర్, ఎండీ అమీర్, అశోక్ రెడ్డి తో పాటు మరి కొంత మందికి చెందిన చెరుకు తోటలు దగ్ధం అయ్యాయి. గ్రామంలో ఉన్న 50 ఎకరాల చెరుకు తోటలు దగ్ధం కావడంతో రైతులకు భారీగా నష్టం జరిగింది. పంట కోయడానికి రెడీగా ఉందని, ఈ నెలలో పంటలు మొత్తం కోసేవాళ్లమని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అందరికి కలిసి కోటి రూపాయాల వరకు నష్టం జరిగిదని చెరుకు రైతులన్నారు. మంటలు ఆర్పేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దగ్గర్లోని, బోరు బావుల నుంచి పైపులతో, బిందులతో మంటలు ఆర్పడానికి విఫల ప్రయత్నం చేశారు. చెరుకు కోతలు జరుగుతున్న సమయంలో దగ్ధం కావడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి
ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఒక్క ఎకరాకు, రెండు లక్షల పంట వచ్చేదని అశోక్ రెడ్డి అనే రైతు వాపోయాడు. ఈ ప్రమాదంతో, గత సంవత్సర కాలంగా తాము పడ్డ కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరయ్యిందని రైతులు అన్నారు. తమకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జహీరాబాద్ నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి, పంటలు మొత్తం బూడిద అయిపోయాయని రైతులు తెలిపారు. ఆ ప్రమాదం ఇంకా పెద్దదిగా కాకుండా, ఫైర్ ఇంజిన్ తో మంటలు ఆర్పారు ఫైర్ ఇంజిన్ సిబ్బంది. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి బుధవారం రోజు, వ్యవసాయ అధికారులు, జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు, ఇతరులు ఇప్పపల్లి గ్రామానికి వెళ్లే అవకాశముంది. అధికారుల నివేదిక పరిశీలించిన తర్వాత, నష్టపరిహారం పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
సంగారెడ్డి :
పారిశ్రామిక వాడ బొల్లారంలోని శ్రీకర రసాయన పరిశ్రమలో ప్రమాదం. రియాక్టర్ పేలి ఏడు మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రమాదంలో గాయపడిన కార్మికులు :... బీజేశ్, ఈశ్వర్ చంద్ర అగారియా, పుష్పరాజ్, సుందర్ సింగ్, చాంద్ ప్రతాప్, షేఖ్ అన్వర్, నీలేష్ సింగ్ గా గుర్తింపు.
కాలిన గాయాలతో వున్న కార్మికులను మదీనా గూడ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
సంబంధిత కథనం