Panchayat Elections: పంచాయితీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామన్న సంగారెడ్డి కలెక్టర్
Panchayat Elections: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధులతో కలెక్టర్ క్రాంతి సమావేశం నిర్వహించారు.
Panchayat Elections: పంచాయితీ ఎన్నికల్లో ప్రతి 650మంది ఓటర్లకు ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వల్లూరు క్రాంతి వెల్లడించారు. ఒక పోలింగ్ కేంద్రాల్లో 650 మంది ఓటర్ల కంటే అధికంగా ఉంటే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కొత్తగా 11 పంచాయతీల ఏర్పాటు....
జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రస్తుతం 647 గ్రామ పంచాయతీలు ఉండగా నూతనంగా ఏర్పాటైన మరో 11 గ్రామపంచాయతీ కలుపుకొని మొత్తం 658 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే భవనాలు, ప్రభుత్వ భవనాలు ఉండేలా చూడాలని , ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భవనాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఓటరుకు రెండు కిలోమీటర్లు లోపు పోలింగ్ కేంద్రం ఉండేలా చూడాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేసిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ లో జాబితా ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీ తెలియజేయాలని జిల్లా కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితా రూపొందించిన ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలను గ్రామపంచాయతీలో ముసాయిధి జాబితా ప్రచురించినట్లు తెలిపారు.
జిల్లాలో 8,51,420 ఓటర్లు....
జిల్లాలో మొత్తం గ్రామపంచాయతీలు 658 మొత్తం వార్డు లు.5718.కుగాను.5732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం పురుష ఓటర్లు 4,27,362, స్త్రీ ఓటర్లు 4,27,739, ఇతరులు 52 మంది మొత్తం ఓటర్ లు 8,51,420 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముసాయిదా ఓటర్ జాబితా రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈనెల 12వ తేదీన అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఆయా మండలాల కు చెందిన రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవోలు నిర్వహించే సమావేశం లో అభ్యంతరాలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీ పరిష్కరించనున్న జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం అనంతరం 17వ తేదీన అన్ని మండలాలు గ్రామపంచాయతీలలో తుది జాబితా ప్రచురించనున్న తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ,డి పి ఓ సాయిబాబా ,కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా ( Marxist ) అహ్మద్ మాణిక్ , ఇండియా నేషనల్ కాంగ్రెస్ షేక్ తాహెర్ పాషా , మహమ్మద్ యాకుబ్ ఆలీ All indai Majilis - E Ittehadul Muslimeen , మల్లిఖార్జున్ భారత రాష్ట్ర సమితి , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.