APSRTC Salaries : ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ‌ - నోటిఫికేషన్ జారీ, ఎవరికి ఎంతంటే..?-salaries revised for contract workers in apsrtc details check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Salaries : ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ‌ - నోటిఫికేషన్ జారీ, ఎవరికి ఎంతంటే..?

APSRTC Salaries : ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ‌ - నోటిఫికేషన్ జారీ, ఎవరికి ఎంతంటే..?

HT Telugu Desk HT Telugu
Nov 08, 2024 05:06 PM IST

ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుల‌కు వేత‌నాలను స‌వ‌రించారు. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన వేతనాలను అక్టోబ‌ర్ 1 నుంచే చెల్లించనున్నారు. వేనత సవరణ ఆదేశాలను అమలు చేయాలని యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ కార్పొరేష‌న్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన (అవుట్-సోర్సింగ్) పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, సెక్యూరిటీ సిబ్బందికి చెల్లించవలసిన కనీస వేతనాల సవరణ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. సవరించిన వేతనాలను అక్టోబ‌ర్ 1 నుంచే కాంట్రాక్ట‌ర్ చెల్లించాల‌ని సూచించింది.

మెయింటెనెన్స్ కాంట్రాక్టులు, స్వీపింగ్, బస్సులు కడగడం, గ్యారేజ్ యార్డులు, ఇతర యూనిట్ల నిర్వహణ, బస్ స్టేషన్ల నిర్వహణ, ఇతర కాంట్రాక్టుల నిర్వహణలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ చెల్లించాల్సిన వేతనాల రేట్లను నిర్దేశిస్తూ 2024 మే 28 నాటి ఆదేశాల ప్ర‌కారం నోటిపికేష‌న్ విడుద‌ల చేశారు. కార్పొరేషన్‌లో 2024 ఏప్రిల్ 1 నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన (అవుట్ సోర్సింగ్) సిబ్బంది, బస్ స్టేషన్‌లు, డిపోలు, ఇతర యూనిట్లలో టాయిలెట్‌ల నిర్వహణలో ప‌ని చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ గెజిట్ ప్ర‌కారం… కాంట్రాక్ట్ లేబర్, సఫాయి కర్మచారిలు, సెక్యూరిటీ సిబ్బందికి చెల్లించాల్సిన రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్‌ను ఇవ్వాల్సి ఉంది. దీని ప్రకారం, కాంట్రాక్ట్ లేబర్, బస్ స్టేషన్లు, డిపోలు, ఇతర యూనిట్లలో మరుగుదొడ్ల నిర్వహణలో ప‌ని చేస్తున్న కార్మికులు (సఫాయి కర్మచారిలు), ఆంధ్రా ప్రాంతంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన (అవుట్ సోర్సింగ్) పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది కింది సవరించిన వేతనాలకు అర్హులు. దీని ప్రకారం 2024 అక్టోబ‌ర్ 1 నుంచి… ఏపీఎస్ఆర్టీసీ డిపోలు, యూనిట్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన (అవుట్ సోర్సింగ్) పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, సెక్యూరిటీ పర్సనల్, సఫాయి కర్మచారిలకు సవరించిన వేతనాలను కాంట్రాక్ట‌ర్ చెల్లించాలి.

కాంట్రాక్ట్ కార్మికుల‌కు ఎంతెంత వేత‌నం పెంపు

1. అన్ స్కిల్డ్ వ‌ర్క‌ర్ః ప్ర‌స్తుత వేత‌నం రూ.11,900 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.12,096

2. సెమి స్కిల్డ్ వ‌ర్క‌ర్ః ప్ర‌స్తుత వేత‌నం రూ.14,058 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.14,290

3. స్కిల్డ్ వ‌ర్క‌ర్ః ప్ర‌స్తుత వేత‌నం రూ.17,247 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.17,532

4. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్స్ః ప్ర‌స్తుత వేత‌నం రూ.12,979 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.13,193

5. అటెండ‌ర్స్ః ప్ర‌స్తుత వేత‌నం రూ.11,900 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.12,096

సెక్యూరిటీ సిబ్బంది, స‌ఫాయి క‌ర్మ‌చారీల‌కు వేత‌న స‌వ‌ర‌ణ‌

1. అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్ట‌ర్, సెక్యూరిటీ హెడ్ గార్డ్ః

ఎ. జోన్-1 (అన్ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్స్)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.14,749 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.14,951.

బి. జోన్-2 (అన్ని మున్సిపాలిటీలు)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.13,749 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.13,951.

సి. జోన్‌-3 (మిగ‌తా ఏరియాలు)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.12,499 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.12,701.

2. సెక్యూరిటీ గార్డ్ః

ఎ. జోన్-1 (అన్ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్స్)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.13,249 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.13,451.

బి. జోన్-2 (అన్ని మున్సిపాలిటీలు)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.12,499 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.12,701.

సి. జోన్‌-3 (మిగ‌తా ఏరియాలు)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.12,249 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.12,451.

3. స‌ఫాయి క‌ర్మ‌చారీః

ఎ. జోన్-1 (అన్ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్స్)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.15,786 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.16,039.

బి. జోన్-2 (అన్ని మున్సిపాలిటీలు)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.15,526 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.15,779.

సి. జోన్‌-3 (మిగ‌తా ఏరియాలు)లో ప్ర‌స్తుత వేత‌నం రూ.15,326 కాగా, స‌వ‌రించిన వేతనం రూ.15,579.

ఏపీఎస్ఆర్టీసీలోని డిపోలు/యూనిట్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన (అవుట్ సోర్సింగ్) పనిచేస్తున్న వారికి పైన పేర్కొన్న విధంగా సవరించిన వేతనాలు చెల్లించబడతాయి. 2024 అక్టోబ‌ర్ 1 నుంచి కాంట్రాక్టర్ ప్రతి నెలా కాంట్రాక్టు కార్మికులకు పైన సవరించిన కనీస వేతనాల కంటే తక్కువ కాకుండా చెల్లించేలా చూడాలని యూనిట్ అధికారులందరికీ సూచించారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner