Sajjala On CBI : సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర-sajjala reaction on cbi mentioning cm jagan name in counter affidavit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala On Cbi : సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర

Sajjala On CBI : సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర

Maheshwaram Mahendra Chary HT Telugu
May 27, 2023 06:24 AM IST

sajjala ramakrishna reddy Lateast News:సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించటం వెనక పెద్ద కుట్ర ఉందన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala ramakrishna reddyOn CBI: సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామృష్ణారెడ్డి. వివేకా హత్య కేసులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై శుక్రవారం స్పందించిన ఆయన....లో సీఎం జగన్ పేరును ప్రస్తావించటం వెనక పెద్ద కుట్ర ఉందన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ను, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్‌ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోందని ఆరోపించారు. ఒక స్క్రిప్టు రాసుకుని.. దాని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నామని చెప్పారు.

"ఎలాంటి ఆధారాలు లేకుండా చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం సెన్షేషనలైజేషన్‌కోసమే ఇవన్నీ చేస్తున్నారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లోమీడియాకు ఎలా ముందుతెలుస్తోంది. ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేస్తుంటే.. దాన్ని సీబీఐ మెన్షన్‌ చేస్తోంది. దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్‌ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుంది. కాని ఇక్కడ అదేమీ జరగలేదు. ముందే అనుకుని అవినాష్‌రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారు. ఆ స్క్రిప్టును ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నారు. సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతోంది. సీబీఐ కౌంటర్‌ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగా ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. సీబీఐ తీరులో విపరీత ధోరణి, అత్యంత అన్యాయమైన తీరు కనిపిస్తోంది. ఉన్నట్టుండి… సడన్‌గా.. జగన్మోహన్‌రెడ్డిగారి పేరును ప్రస్తావించడమే దీనికి నిదర్శనం. అసలు దీనికి ఏ ఆధారమేదీ వాళ్లదగ్గర ఏమీ కనిపించడంలేదు. చిల్లర చేష్ట మాదిరిగా ఉంది. జగన్మోహన్‌రెడ్డిగారి పేరును ప్రస్తావించి దాన్ని సెన్షేషనలైజేషన్‌కోసం వాడుకోవాలన్న తీరు కనిపిస్తోంది. సీబీఐ ఇలా కౌంటర్‌ అఫిడవిట్‌ విషయం తెలియగానే, టీడీపీ పొలిట్‌ బ్యూరోలో దీనిపై చర్చించడం, జగన్‌గారి పాత్ర అందరికీ తెలుసంటూ వారు ఆరోపణలు చేయడం.. ఇదంతా గొలుసుకట్టు మాదిరిగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఇది ఒక పెద్ద కుట్ర. ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ముందు తేల్చాలి. దానిపై అసలు దర్యాప్తు జరగాలి. ఈ కుట్రలో చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావుల పాత్రను తేల్చాలి" అని సజ్జల డిమాండ్ చేశారు.

సునీత, వీళ్ల మధ్య ఏముందనేది తేల్చాలన్నారు సజ్జల. ముందే ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేసి, దాన్ని సీబీఐ ప్రస్తాదించడం ఇక్కడ చూడాల్సిన విషయమని చెప్పారు. సీబీఐ కౌంటర్లో పేర్కొన్న అంశంలో హేతు బద్ధత లేదన్న సజ్జల... సీబీఐ రాసింది కాబట్టి.. ఈ మాటలు కూడా చెప్పాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. "ముందుగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో అవినాష్‌ పేరు లేదు. సడన్‌గా ఓ కౌంటర్‌ వేసి.. నిందితుడు అని చెప్తారు. సీబీఐ రెండునెలలు దస్తగిరిని తన దగ్గర పెట్టుకుని అవినాష్‌ పేరును ప్రస్తావనకు తెచ్చేలా చేస్తారు. ఆతర్వాత బెయిల్‌ ఇస్తారు. విచిత్రంగా ఈ బెయిల్‌ను సునీత అభ్యంతరం పెట్టదు. సుమారు ఏడాదిన్నర తర్వాత అవినాష్ పేరును సీబీఐ ప్రస్తావిస్తోంది.సడన్‌గా భాస్కర్‌రెడ్డిని అరెస్టచేస్తారు.. తర్వాత అవినాష్‌ను అరెస్టు చేయాలంటారు. ఇప్పుడేమో కౌంటర్లో జగన్మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తారు. అసలు వీటికి ఆధారలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. దర్యాప్తులో చూడాల్సిన కోణాలు ఎన్నో ఉన్నాయి. కాని, వాటి జోలికిపోరు. షమీమ్‌ స్టేట్‌మెంట్‌ను పట్టించుకోరు, ఆస్తివివాదాలను ప్రస్తావించినా సీబీఐ దాన్ని పట్టించుకోలేదు. పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఆస్పత్రిలో ఉండి.. మధ్యలో టీడీపీ నాయకుడు బీటెక్‌ రవిని కలిసి వస్తాడు. ఇన్ని ఉండగా వీటిని సీబీఐ పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగారికి సమాచారం పోయిందన్న ఆరోపణ సడన్‌గా చేస్తున్నారు. అందరూ చర్చించుకోవాలన్న దృక్పథంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటికి ఆధారాలు మాత్రం ఉండడం లేదు. దిగజారిపోయిన రాజకీయ పార్టీ మాదిరిగా సీబీఐ కూడా వ్యవహరిస్తోంది" అని సజ్జల దుయ్యబట్టారు.

సంబంధిత కథనం