Sajjala Ramakrishna Reddy : ఇప్పటం అంశం ఇంటర్నేషనల్ సమస్యనా?-sajjala ramakrishna reddy comments on tdp and janasena over ippatam issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Sajjala Ramakrishna Reddy Comments On Tdp And Janasena Over Ippatam Issue

Sajjala Ramakrishna Reddy : ఇప్పటం అంశం ఇంటర్నేషనల్ సమస్యనా?

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 10:04 PM IST

Sajjala On TDP and Janasena : ఇప్పటం విషయంలో హైకోర్టు తీర్పు టీడీపీ, జనసేనకు చెంపపెట్టు అని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అబద్ధాలతో తప్పుదోవ పటిస్తున్నారని ఆరోపించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫొటో)
సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫొటో) (facebook)

ఇప్పటం(Ippatam) విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందించారు. ఇప్పటం అంశాన్ని ఇంటర్నేషనల్ సమస్యగా టీడీపీ(TDP), జనసేన(Janasena) చిత్రీకరించాయన్నారు. టీడీపీకి తెలిసిన ఏకైక విద్య తప్పుడు ప్రచారం చేయడమని విమర్శించారు. లేని సమస్యను సృష్టించి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

టీడీపీ ఎల్లోమీడియా సాయంతో దారుణమైన అసత్యాలను ప్రచారం చేస్తుందని సజ్జల ఆరోపించారు. రోజువారీగా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ(TDP)కి తెలిసిన ఏకైక విద్య తప్పుడు ప్రచారం చేయడమే.. కల్పితమైన కథలతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నం చేయడమే అని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) సభకు భూములిచ్చిన వారి ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందని అబద్ధపు ప్రచారం అల్లారన్నారు. ఈరోజు హైకోర్టు(High Court) విచారణతో అసలు నిజం బయటపడిందని చెప్పారు. ఇప్పటంలో ఏం జరిగిందనేది తెలుసుకోకుండా.. పవన్‌ కల్యాణ్‌ ఆక్రోశం వెళ్లగక్కడం విచారకరమన్నారు.

'ఆక్రమణల తొలగింపునకు మార్చిలోనే నోటీసులిచ్చిన సంగతి ఆరోజే వెల్లడైంది. అసలు, ఆక్రమణల తొలగింపునకు నోటీసు(Notice)లతో పనిలేకుండానే చర్యలు చేపట్టే హక్కు, బాధ్యత ప్రభుత్వానికుంటుంది. ఇప్పటం ఇష్యూ(Ippatam Issue)ని ఇంటర్నేషనల్‌ స్థాయి వార్తగా గొడవచేసినప్పటికీ ఆ రోజే నిజాలు బయటకొచ్చాయి. లేనిపోని అబద్ధాలను క్రియేట్‌ చేశారు. కొన్ని పత్రికలు పొలిటికల్‌ విష ప్రచారానికి టీడీపీ, పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ఉన్నాయి. హైకోర్టు(High Court) మొట్టికాయలతో వాళ్ల ప్రయత్నాలు బెడిసికొట్టాయి.' అని సజ్జల అన్నారు.

అబద్ధాలతో కోర్టును కూడా తప్పుదోవపట్టించినందుకు జరిమానా విధించడంతో మరోమారు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ విషప్రచారం తేటతెల్లమైందని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రతీ చిన్నవిషయాన్ని కూడా బ్యానర్‌లు చేసి వార్తలు ప్రచురిస్తూ చంద్రబాబుకు వంతపాడుతున్నారు కొంతమంది అని ఆరోపించారు.

హైకోర్టు ఏం చెప్పిందంటే..

ఇప్పటం వివాదం కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు(Guntur) జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో ముందస్తు షోకాజు నోటీసుల ఇచ్చి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కొన్నింటిని తొలగించింది. ఇక్కడకు పవన్ కల్యాణ్ పర్యటనతో వివాదాస్పదమైంది. మరోవైపు షోకాజ్ నోటీసు లేకుండా ఇళ్లు కూల్చేస్తున్నారని కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. షోకాజు నోటీసులిచ్చినట్టుగా ప్రభుత్వం రుజువులు చూపించింది. పిటిషనర్లు కూడా షోకాజు నోటీసులిచ్చారని అంగీకరించారు. ఈ విషయంపై హైకోర్టు మండిపడింది. కోర్టును పక్కదారి పట్టించి స్టే తెచ్చుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

IPL_Entry_Point