RS.99 Liquor Effect: రూ.99 లిక్కర్ ఎఫెక్ట్.. ఏపీలో మద్యం అమ్మకాల్లో భారీగా పడిపోయిన ఆదాయం
RS.99 Liquor Effect: ఆంధ్రప్రదేశ్‌లో రెండు నెలల క్రితం ప్రారంభమైన ప్రైవేట్ మద్యం దుకాణాల్లో అందుబాటులోకి తెచ్చిన రూ.99మద్యంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. చౌక ధరలకు నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో ఆ ఎఫెక్ట్ రెవిన్యూపై పడింది.
RS.99 Liquor Effect: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మద్యం దుకాణాలు, రూ.99 మద్యం విక్రయాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఆర్థిక శాఖ సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేట్ మద్యం దుకాణాలకు మొగ్గు చూపడంతో మద్యంతో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలతో దాదాపు రూ.30వేల కోట్ల రుపాయలు ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించడంతో అమ్మకాలతో ఆదాయంలో ఎక్కువ భాగం ప్రభుత్వానికి సమకూరేది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
వైసీపీ హయంలో కేవలం నగదుతోనే మద్యం విక్రయాలు జరపడం, నాణ్యత లోపాలు, పాపులర్ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా మద్యంపై ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. లోపాలను సవరించి ప్రభుత్వమే మద్యం విక్రయాలను కొనసాగించాలని ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పలు కారణాలతో ప్రైవేట్ మద్యం దుకాణాల వైపు మొగ్గు చూపారు. దాని పర్యావసానాలు రెండు నెలల్లోనే కనిపిస్తున్ానయి.
ఆంధ్రప్రదేవ్‌లో మద్యం అమ్మకాల్లో క్వార్టర్ రూ.99మద్యం డిమాండ్ పెరిగిపోతోంది. లిక్కర్ మార్కెట్‌ను ఈ బ్రాండ్లు ఆక్రమిస్తున్నాయి. దాదాపు ఆరేడు బ్రాండ్లు రూ.99 ధరకు మద్యం విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. వీటి విక్రయాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం మద్యం అమ్మకాల్లో ‘99’ రుపాయల మద్యం బ్రాండ్ల వాటా 25 శాతానికి చేరుకుంది.
దీంతో అన్ని డిస్టిలరీలు పోటీని తట్టుకోడానికి రూ.99 క్వార్టర్ మద్యాన్ని తయారు చేయాలని యోచిస్తున్నాయి. రూ.99 బ్రాండ్ల అమ్మకాలు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది. మద్యం విక్రయాలపై షాపులకు కమిషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. ఆదాయం తగ్గినా మద్యం వినియోగదారుల డిమాండ్ పెరగడంతో ఏపీబీసీఎల్ నుంచి కొనుగోలు చేసి అమ్ముతున్నారు.
ఏపీలో సగటున నెలకు 30 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2024 అక్టోబరు 16 నుంచి ప్రైవేటు మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చింది. అక్టోబర్‌లో 15 రోజుల అమ్మకాల్లో 99 రుపాయల మద్యం అమ్మకాలు 5.6 శాతంగా మాత్రమే ఉన్నాయి. డిస్టిలరీల్లో ఉత్పత్తి తక్కువగా ఉండటంతో డిమాండ్ ఉన్నా అమ్మకాలు జరగలేదు.
నవంబరులో వీటి అమ్మకాలు 14.85 శాతానికి చేరాయి. 4,55,086 కేసులను నవంబర్ నెలలో విక్రయించారు. డిసెంబర్ 15వ తేదీ వరకు జరిగిన అమ్మకాల్లో గణనీయంగా పెరుగుదల కనిపించింది. పక్షం రోజుల్లో 19.95 శాతానికి పెరిగింది. నెలాఖరులోగా 25 శాతం దాటనుంది. నెలలో విక్రయించే 30 లక్షల కేసుల్లో 99 బ్రాండ్ల మద్యం వాటా దాదాపుగా 8 లక్షల కేసులు ఉండదనుంది.
చీప్ లిక్కర్ అమ్మకాలు ఈ స్థాయిలో ఎప్పుడూ లేవు. దీని ప్రభావం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై కూడా పడనుంది. ఇతర బ్రాండ్లతో పోలిస్తే రూ.99 మద్యం అమ్మకాలతో ప్రభుత్వ రెవిన్యూ గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయానికి భారీగా గండిపడుతుందనే ఆందోళన ఆ శాఖలో నెలకొంది.
సంబంధిత కథనం