AP Revenue: ఏపీలో 7వేల ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు, 25వేల ఎకరాల్లో అక్రమాల నిర్ధారణ.. రెవిన్యూ శాఖ నిర్ణయం-revenue department decides to cancel illegal registrations of 7 000 acres in ap confirm irregularities in 25 000 acres ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Revenue: ఏపీలో 7వేల ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు, 25వేల ఎకరాల్లో అక్రమాల నిర్ధారణ.. రెవిన్యూ శాఖ నిర్ణయం

AP Revenue: ఏపీలో 7వేల ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు, 25వేల ఎకరాల్లో అక్రమాల నిర్ధారణ.. రెవిన్యూ శాఖ నిర్ణయం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 04, 2025 04:30 AM IST

AP Revenue:ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ లో పెట్టారని, ఇందులో నాలుగు లక్షల పైగా ఎకరాలు అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసినట్టు గుర్తించినట్టు రెవిన్యూ మంత్రి అనగాని వివరించారు. వీటిలో 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారని, 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని నిర్ణయించారు.

ఏపీలో రెవిన్యూ సదస్సులపై సమీక్షిస్తున్న మంత్రి అనగాని
ఏపీలో రెవిన్యూ సదస్సులపై సమీక్షిస్తున్న మంత్రి అనగాని

AP Revenue: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 7వేల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది,. వైసీపీ ప్రభుత్వ హయాంలో 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ లో పెట్టారని, ఇందులో నాలుగు లక్షల పైగా ఎకరాలు అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసినట్టు గుర్తించినట్టు రెవిన్యూ మంత్రి అనగాని వివరించారు. వీటిలో 25 వేల ఎకరాలను ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారని, 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని తనిఖీల్లో గుర్తించినట్టు చెప్పారు. .

yearly horoscope entry point

ఏపీలోని 12 జిల్లాల కలెక్టర్లు జేసీలు ప్రజాప్రతినిధులతో ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో 32 రకాల ఫిర్యాదులకు సంబంధించి అర్జీలు వస్తున్నాయని మంత్రి అనగాని వివరించారు. లక్షకు పైగా అర్జీలు ఆర్వోఆర్ రికార్డులకు సంబంధించిన అంశాలపైనే ఉన్నాయని, 7000 అర్జీలు రీ సర్వే వివాదాలపై వచ్చాయని వివరించారు.

రెవెన్యూ సదస్సులోనే ఈ అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 22ఏలో 1 కోటి 88 లక్షల ఎకరాల అంశం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జనవరి 8 తేదీన ముగుస్తాయని, ఉత్తరాంధ్ర లో సంక్రాంతి పండుగ తర్వాత కూడా 5 రోజుల పాటు రెవెన్యూ సదస్సు లు నిర్వహిస్తామని చెప్పారు.

జనవరి 20 తేదీ నుంచి రీసర్వే ప్రక్రియ మళ్ళీ మొదలు పెడతామని, రోజుకు 20 ఎకరాల చొప్పున మాత్రమే బ్లాక్ వైస్ గా రీ సర్వే చేస్తామన్నారు. మండలానికి ఒక గ్రామం పైలెట్ గా రీసర్వే ప్రక్రియ జరుగుతుందని, ఫ్రీ హోల్డ్ భూముల రిజస్ట్రేషన్ లపై మంత్రుల కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

దీనిపై రెవెన్యూ, ఆర్థిక, పురపాల,క దేవాదాయ మైనారిటీ శాఖల మంత్రులతో కమిటీ వేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ లో పెట్టారని, ఇందులో నాలుగు లక్షల పైగా ఎకరాలు అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసినట్టు గుర్తించామని అనగాని చెప్పారు. ఇందులో 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన భూముల్లో 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్ల ను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించినట్టు వివరించారు.

రెవెన్యూ సదస్సులలో అర్జీలు పై ఆడిట్ కూడా నిర్వహిస్తున్నామని, పీజీ ఆర్ ఎస్ ద్వారా రెవెన్యూ సదస్సు ల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ విలువల రేషనలైజేషన్ చేస్తున్నామని, గ్రోత్ కారిడార్ లలో భూముల విలువలు పెరుగుతాయని, తగ్గించాల్సిన చోట తగ్గిస్తామని చెప్పారు.

Whats_app_banner