Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య-retired nalgonda congress leader ellaiah murder mystery trapped and murdered in jaggaiyapet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

Sarath chandra.B HT Telugu
May 02, 2024 08:24 AM IST

Nalgonda Ellayya: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య అదృశ్యం మిస్టరీ వీడింది. సెటిల్‌మెంట్‌ పేరుతో ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు రప్పించి ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. హతుడు, నిందితుడు ఇద్దరు మాజీ మావోయిస్టులుగా తేలింది.

జగ్గయ్యపేటలో నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడి హత్య
జగ్గయ్యపేటలో నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడి హత్య (unshplash representative image )

Nalgonda Ellayya: సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా Congress Leader కాంగ్రెస్ నాయకుడు ఎల్లయ్య అదృశ్యం Missing Case కేసు మిస్టరీ వీడింది. మావోయిస్టు పార్టీ నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సెటిల్‌మెంట్లు Settlements చేస్తున్న ఎల్లయ్యను, మరో Ex Maoist మాజీ మావోయిస్టు శ్రీకాంతాచారి పథకం ప్రకారం హత్య చేసినట్టు గుర్తించారు. హ‍త్య తర్వాత శవాన్ని విశాఖపట్నం తరలించి సముద్రంలో పడేసినట్టు గుర్తించారు.

ఏప్రిల్ 19న ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జిల్లాలో సెటిల్‌మెంట్‌ కోసం వచ్చిన అదృశ్యమైన ఎల్లయ్య హత్యకు గురయ్యాడు. జగ్గయ్యపేటలో అదృశ్యమైన ట్లు కేసు నమోదైన తర్వాత, సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను తానే కొంత మందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేటకు చెందిన తాడూరి శ్రీకాంత చారి తహశీల్దార్ ఎదుట లొంగిపోయాడు.

ఎల్లయ్య సోదరుడు సతీష్ ఫిర్యాదుతో జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేశారు. నిందితుడు సూర్యాపేట పోలీసులకు లొంగిపయాడు. సూర్యాపేట పోలీసులు అతడిని జగ్గయ్యపేట తరలించారు.

ఏప్రిల్‌ 19న జగ్గయ్యపేటలోని అద్దె ఇంట్లో శ్రీకాంతచారి తన అనుచరులతో కలిసి ఎల్లయ్యను హత్య చేసి విశాఖపట్నం తరలించాడు. మృతదేహం అచూకీతో పాటు నిందితుడికి సహ కరించిన వారి కోసం ప్రయత్నిస్తున్నట్లు జగ్గయ్యపేట పోలీసులు తెలిపారు.

ఏమి జరిగిందంటే…

మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఎల్లయ్య కొన్నేళ్ల క్రితం జనజీవన స్రవంతిలో కలిశాడు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. మాజీ మావోయిస్టుగా ఉన్న అనుభవంతో సెటిల్‌మెంట్లు దందాలకు పాల్పడే వాడు. ఈ క్రమంలో మరో మాజీ మావోయిస్టు శ్రీకాంతాచారితో అతని వివాదాలు ఏర్పడ్డాయి. నగదు విషయంలో తలెత్తిన విభేదాలతో ఎల్లయ్యను చంపాలని శ్రీకాంతాచారి నిర్ణయించుకున్నాడు.

ఫ్యామిలీ సెటిల్‌మెంట్లలో ఎల్లయ్యకు అనుభవం ఉండటంతో అలాగే ట్రాప్‌ చేయాలని నిర్ణయించాడు. అపర్ణ అనే మహిళ సాయంతో ఎల్లయ్యకు వల వేశాడు. ఎల్లయ్య బంధువు వెంకన్న ద్వారా ఓ మహిళను సెటిల్‌మెంట్‌ కోసం అతడి దగ్గరకు పంపాడు. ఆమెకు భర్తతో విభేదాలు ఉన్నాయని, విడాకులతో పాటు భరణం ఇప్పించాలని ఆమె అతడిని ఆశ్రయించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే పథకం పారదని భావించి కోదాడకు సమీపంలో ఉండే జగ్గయ్యపేటలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

అపర్ణతో పాటు సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్‌లు సహజీవనం చేస్తున్నారని, వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోవడానికి పరిహారం ఇప్పించాలని ఎల్లయ్యను ఆశ్రయించింది. ఈ వ్యవహారం సెటిల్ చేయడానికి ఎల్లయ్యను జగ్గయ్యపేట రప్పించాలని భావించారు. ఈ సమస్య పరి ష్కరించడానికి ఏప్రిల్ 16న ఎల్లయ్య జగ్గయ్యపేట బయలుదేరాడు. అతనితో పాటు మిత్రుడు అంజయ్య కూడా రావడంతో ప్లాన్ మార్చి 18న రావాలని సూచించాడు.

ఏప్రిల్ 18న అనుచరులతో జగ్గయ్యపేట చేరుకున్న నిందితులు విజయవాడ రోడ్డులోని ఎస్ఎస్ కాలేజీ దగ్గర ఎల్లయ్యను కలిశారు. దంపతులతో సెటిల్‌మెంట్‌లో భాగంగా సూర్యాపేట వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఎల్లయ్యను ఒంటరిగా తీసుకెళ్లారు. ఎల్లయ్యను జగ్గయ్యపేట తీసుకొచ్చిన మహిళతో పాటు ఎల్లయ్య స్నేహితుడు టీ స్టాల్‌ సమీపంలో ఉండిపోయారు.

కాసేపటి తర్వాత అపర్ణ తాను టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెప్పడంతో అంజయ్య ఆమెను జగ్గయ్యపేట బస్టాండ్‌ తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. ఎల్లయ్య ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానించిన అంజయ్య వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

డబ్బులిస్తానని అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లిన ఎల్లయ్యను తన అనుచ రుల సాయంతో శ్రీకాంతచారి చంపేసి మృతదేహాన్ని చేపలు రవాణా చేసే బాక్సులో పెట్టి లారీలో విశాఖ పట్నం పంపారు. అక్కడ మృతదేహంతో పాటు వినియోగించిన ఫోన్లు, సిమ్ కార్డులు సముద్రంలో పడేయాలని సూచించాడు. మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిందితుడు శ్రీకాంతాచారిపై ఇప్పటికే 34 కేసులు ఉన్నాయి. నల్గొండలో హత్య చేస్తే పోలీసులకు దొరికిపోతానని జగ్గయ్యపేటను ఎంచుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో నిందితుడిని రిమాండ్‌కు పంపారు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం తనను హత్య చేస్తానని హెచ్చరించడంతోనే అడ్డు తొలగించుకోడానికి శ్రీకాంతాచారి స్కెచ్ వేసినట్టు తెలిపాడు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. మృతదేహం కూడా గల్లంతు కావడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం