Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బందికి ఊరట.. పన్ను వసూళ్లపై వెనకడుగు, చెల్లింపులకు ముందుకొచ్చిన యాజమాన్యాలు..-relief for public sector bank employees managements have stepped back on tax collections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బందికి ఊరట.. పన్ను వసూళ్లపై వెనకడుగు, చెల్లింపులకు ముందుకొచ్చిన యాజమాన్యాలు..

Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బందికి ఊరట.. పన్ను వసూళ్లపై వెనకడుగు, చెల్లింపులకు ముందుకొచ్చిన యాజమాన్యాలు..

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 29, 2025 08:18 AM IST

Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు ఊరట దక్కింది. గత కొన్ని వారాలుగా బ్యాంకింగ్‌ ఉద్యోగులకు పన్ను వసూళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చెల్లుబాటులో ఉన్న రుణాలపై అదనపు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో కలకలం రేగింది.ఉద్యోగుల నిరసనలతో ప్రభుత్వ బ్యాంకులు వెనక్కి తగ్గాయి.

సిబ్బంది నుంచి అదనపు పన్ను వసూళ్లపై వెనక్కి తగ్గిన బ్యాంకులు
సిబ్బంది నుంచి అదనపు పన్ను వసూళ్లపై వెనక్కి తగ్గిన బ్యాంకులు

Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కేంద్రం షాక్ ఇచ్చింది. బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే రుణాలపై రాయితీలపై కూడా పన్ను వసూలు చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించడంతో కలకలం రేగింది. ప్రస్తుతం మనుగడలో ఉన్న అన్ని రకాల రుణాలపై పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది.

yearly horoscope entry point

గతంలో తీసుకున్న రుణాలు ప్రస్తుతం ఈఎంఐలు చెల్లిస్తున్నా వాటికి లభిస్తున్న రాయితీలపై పన్ను లెక్కించారు. ఈ విధానంలో బ్యాంకు ఉద్యోగులకు ప్రస్తుతం లభిస్తున్న రాయితీని ఆదాయం కింద పరిగణించి పన్ను లెక్కించారు. ఫలితంగా ఉద్యోగులు 204-25 ఆర్ధిక సంవత్సరంలో భారీగా పన్ను చెల్లించాలని నోటీసులు అందుకున్నారు. ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న వ్యక్తిగత రుణాలు, హౌసింగ్ లోన్స్‌, వాహన రుణాలు, శాలరీ అడ్వాన్సులు వంటి వాటిపై అయా బ్యాంకులు వడ్డీ రాయితీ ఇస్తుంటాయి.

సాధారణ రుణాలతో పోలిస్తే బ్యాంకు సిబ్బందికి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తారు. ప్రధానంగా హౌసింగ్‌ లోన్స్‌, పర్సనల్ లోన్స్‌‌లో వడ్డీ రాయితీ లభిస్తుండగా, శాలరీ అడ్వాన్సుల వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బందికి లభించే రాయితీలపై పన్ను వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది నుంచి ఇది అమలు చేయాలని నిర్ణయించారు.

దీంతో డిసెంబర్‌ నుంచి ఉద్యోగులకు అదనపు ఆదాయాన్ని లెక్కించి ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి, మార్చి నెల జీతాల్లో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుందని ముందస్తు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలా ఉద్యోగులు చెల్లించాల్సి పన్ను భారీగా ఉండటంతో జీతం మొత్తం పన్నులకు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలు దిగొచ్చాయి.

ఉద్యోగులు ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన మొత్తాలను బ్యాంకులు కేంద్రానికి చెల్లించాలని నిర్ణయించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగులకు చెల్లిస్తున్న రాయితీలకు గాను సగటున రూ.300కోట్ల వరకు ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న బ్యాంకులకు ఈ మొత్తం రూ.500కోట్లకు మించి ఉంటుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8లక్షల ఉద్యోగులు..

2024 నాటికి, భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 8లక్షలుగా ఉన్నారు. 2014లో 8,42,813 మంది ఉద్యోగులు ఉండగా పదేళ్లలో వారి సంఖ్య భారీగా తగగ్ింది. పదవీ విరమణలు, బ్యాంకుల విలీనం వంటి కారణాలతో బ్యాంకుల్లో సిబ్బంది సంఖ్య తగ్గింది.

ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో 2021 నాటికి రెండున్నర లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 84వేల మంది ఉద్యోగులు,పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో లక్ష మంది ఉద్యోగులు, యూనియన్‌ బ్యాంకులో 75వేలమంది ఉన్నారు. కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకుతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సిబ్బంది కలిపి దాదాపు 8లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Whats_app_banner