AP Secretariat Employees : గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు షెడ్యూల్‌ విడుదల - మార్గ‌ద‌ర్శ‌కాలివే-release of schedule and guidelines for transfers of village and ward secretariat employees in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Secretariat Employees : గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు షెడ్యూల్‌ విడుదల - మార్గ‌ద‌ర్శ‌కాలివే

AP Secretariat Employees : గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు షెడ్యూల్‌ విడుదల - మార్గ‌ద‌ర్శ‌కాలివే

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 01:39 PM IST

రాష్ట్రంలోని గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు షెడ్యూల్‌ విడుదలైంది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై ప్రభుత్వం మార్గదర్శకాలు, సూచనలను చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సర్కూల‌ర్ ను జారీ చేసింది. కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన స‌ర్టిఫికెట్లపై కూడా క్లారిటీ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప‌ని చేసే ఉద్యోగుల బ‌దిలీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల అయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర్కూల‌ర్ జారీ చేసింది. రాష్ట్రంలో 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి బ‌దిలీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించింది. ఈ మేర‌కు వెబ్‌సైట్‌లో ఆప్ష‌న్ అందుబాటులోకి తెచ్చింది.

గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ (జీవీడ‌బ్ల్యూవీ) & గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం (వీఎస్‌డ‌బ్ల్యూఎస్‌) డిపార్ట్‌మెంట్‌తో సహా కొన్ని విభాగాల ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం 2024 ఆగస్టు19 నుండి 2024 ఆగస్టు 31 వరకు నిషేధాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు, సూచనలను జారీ చేసింది.

షెడ్యూల్‌:

1. ఆన్‌లైన్ అప్లికేష‌న్ దాఖ‌లకు చివ‌రి తేదీ ఆగ‌స్టు 27.

2. అధికారులు దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి, ప్రాధాన్యత కింద సీనియారిటీ ప్రకారం చేయాలి - గడువు ఆగస్టు 28.

3. కౌన్సిలింగ్ (క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో) ఆగస్టు 29, 30

4. ఉద్యోగి ఫిర్యాదులు ఏవైనా ఉంటే పూర్వ జిల్లా కలెక్టర్ ముందు దాఖలు చేయవచ్చు - గడువు ఆగ‌స్టు 30.

మార్గ‌ద‌ర్శ‌కాలు:

1. గ్రామ సచివాలయాలు మరియు వార్డు స‌చివాల‌యాలలో పని చేస్తున్న ఉద్యోగులు బదిలీని కోరుకునే వారు తమ లాగిన్‌ల ద్వారా https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login  పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అభ్యర్థనలను సమర్పించవచ్చు. అందులో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

2. పోర్టల్ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login  మరియు అన్ని గ్రామ/వార్డు సెక్రటేరియట్‌ల్లోని నోటీసు బోర్డులలో సంబంధిత హోదాల క్రింద అందుబాటులో ఉన్న ఖాళీల జాబితాను ప్రచురించాలని జిల్లా కలెక్టర్లు, పూర్వపు జిల్లాల ఇతర నియామక అధికారుల‌కు సూచించాం.

3. పూర్వ జిల్లాల జిల్లా కలెక్టర్లు, ఇతర అపాయింటింగ్ అథారిటీలు కింద సూచించిన విధంగా చేయాలి.

ఏ. ఆన్‌లైన్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయాలి.

బీ. దరఖాస్తులను ధృవీకరించాలి.

సీ. ప్రాధాన్యత ప్రకారం దరఖాస్తులను వర్గీకరించాలి.

డీ. కౌన్సెలింగ్ నిర్వహించే ముందు మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ ప్రకారం దరఖాస్తులను నిర్వహించాలి.

4. అపాయింటింగ్ అథారిటీలు అనుబంధంలో పొందుపరచబడిన ఎస్ఓపీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలి. ప్రభుత్వం నిర్దేశించిన టైమ్‌లైన్ అంటే 2024 ఆగస్టు 31 కంటే ముందే ప్లేస్ పోస్టింగ్ ఆర్డర్‌లను జారీ చేయాలి.

5. అత్యవసర పరిపాలన అవసరాల రిత్యా గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల అపాయింట్ అథారిటీ వారు ఏ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని అయినా బదిలీ చేయుటకు అధికారం కలదు.

6. ఉద్యోగిపై పెండింగ్‌లో ఉన్న ఏవైనా క్రమశిక్షణా ఆరోపణలు, ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగి అభ్యర్థన పరిగణించొద్దు.

7.అభ్యర్థనపై అమలు చేయబడిన అన్ని బదిలీలకు టీటీఏ లేదా ఇతర బదిలీ ప్రయోజనాల మంజూరుకు అర్హత లేదు.

8. ఇవి త‌ప్ప‌ని స‌రిగా చేయాలి.

ఏ. ఏ ఉద్యోగిని వారి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డులోని ఏ గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో నియమించకూడదు.

బీ. ఏదైనా తప్పుడు సమాచారం, పత్రాలు సమర్పించినట్లయితే, వారు క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహిస్తారు.

9. ఐటీడీఏ యేతర ప్రాంతాలలో పోస్టులను భర్తీ చేయడానికి ముందుగా నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలి.

10. ఐటీడీఏ ప్రాంతాలతో పాటు, అధిక సంఖ్యలో ఖాళీలు ఉన్న అంతర్గత, వెనుకబడిన ప్రాంతాలకు బదిలీలపై ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

11. ఐటీడీఏ ప్రాంతాలలో రెండేళ్ల‌కు పైగా పని చేస్తున్న ఉద్యోగులను షరతులకు లోబడి, ఉద్యోగుల మధ్య ఇంటర్-సీ సీనియారిటీకి తగిన ప్రాధాన్యతనిస్తూ వారికి నచ్చిన స్టేషన్‌లకు బదిలీ చేయవచ్చు.

12. ఐటీడీఏ ప్రాంతాలలో పోస్టింగ్‌ల ప్రయోజనం కోసం, ఈ క్రింది ప్రమాణాలను అనుసరించాలి.

ఏ. ఉద్యోగులు 50 ఏళ్లలోపు ఉండాలి.

బీ. ఐటీడీఏ పరిధిలో ఇంతకుముందు పని చేయని ఉద్యోగులను ప్రాధాన్య క్రమంలో మైదాన ప్రాంతాల్లో వారి సర్వీస్ వ్యవధిని పరిగణనలోకి తీసుకుని బదిలీలకు పరిగణనలోకి తీసుకోవాలి.

13. జిల్లా కలెక్టర్లు, ఇతర నియామక అధికారులు ఐటీడీఏ ప్రాంతాల నుండి బదిలీ చేయబడిన వారిని, వారి స్థానంలో ప్రత్యామ్నాయం లేకుండా/ చేరకుండా రిలీవ్ కాకుండా చూసుకోవాలి.

14. నాన్-ఐటీడీఏ ఏరియా నుండి ఐటీడీఏ ఏరియాకి పోస్ట్ చేయబడిన ఉద్యోగులు నిర్ణీత సమయంలోగా వారి పోస్టింగ్ స్థానంలో రిపోర్ట్ చేయాలి. ఐటీడీఏ పరిధిలోని పోస్టింగ్ ప్రాంతానికి నివేదించని ఏ ఉద్యోగి అయినా అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

15. ఉద్యోగుల‌ను రిలీవ్ చేసే సమయంలో, అపాయింటింగ్ అథారిటీలు రిలీఫ్ తేదీలో ఆ ఉద్యోగి ఎలాంటి బకాయిలు లేవని నిర్ధారించాలి. ఏదైనా ఉంటే చట్టపరమైన కేసులకు సంబంధించిన అన్ని రికార్డులను కూడా సమర్పించాలి.

16. కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థి త‌మ‌ అభ్యర్థనను కోల్పోతారు. బదిలీ చేయబడరు.

17. ఏవైనా వివ‌రాలు లేదా సాంకేతిక సమస్యల కోసం, డైరెక్టర్, జీఎస్‌డ‌బ్ల్యూఎస్‌, విజయవాడ వద్ద ఏర్పాటు చేసిన 'బదిలీ హెల్ప్ లైన్' 9010656383; 7981927494; 8309961905 ఫోన్‌ నంబర్‌లను ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య సంప్రదించ‌వ‌చ్చు.

కౌన్సిలింగ్‌కు ఏఏ స‌ర్టిఫికేట్లు తీసుకెళ్లాలి

కౌన్సిలింగ్‌కు విజువ‌ల్ ఛాలెంజ్‌డ్‌, మెంట‌ల్ ఛాలెంజ్‌డ్‌ ఉద్యోగులైతే మెడిక‌ల్ స‌ర్టిఫికెట్‌, నో డ్యూస్ స‌ర్టిఫికేట్ ఒరిజిన‌ల్ తీసుకెళ్లాలి. 40 శాతం, అంత‌కంటే పైబ‌డిన దివ్యాంగు ఉద్యోగులైతే స‌ద‌ర‌న్ స‌ర్టిఫికేట్‌, నో డ్యూస్ స‌ర్టిఫికేట్ తీసుకెళ్లాలి. అలాగే గిరిజ‌న ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ ప‌ని చేసిన ఉద్యోగులైతే రెండేళ్లు ట్రైబుల్ ఏరియాలో ప‌ని చేసిన‌ట్లు డ్యూటీ స‌ర్టిఫికేట్‌, నో డ్యూస్ స‌ర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

 కేన్స‌ర్‌, ఓపెన్ హ‌ర్ట్ ఆప‌రేష‌న్‌, న్యూరోస‌ర్జ‌రీ, కిడ్నీ ట్రాన్స‌ప్లాంటేష‌న్ మొద‌లైన వంటి వాటి ప్రాతిప‌దిక‌న (వ్య‌క్తిగ‌తంగా, లేక భార్య‌కైనా, లేక పిల్ల‌లకైనా) ట్రాన్స‌ఫ‌ర్ కావాల‌నుకునే ఉద్యోగులు మెడిక‌ల్ స‌ర్టిఫికేట్‌, నో డ్యూస్ స‌ర్టిఫికేట్ తీసుకెళ్లాలి. కారుణ్య నియామ‌కాల్లో ఉద్యోగం పొందిన మ‌హిళ వితంతు ఉద్యోగులు కారుణ్య అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్‌, నో డ్యూస్ స‌ర్టిఫికెట్ చూపించాలి. 

భార్య, భ‌ర్త‌లిద్ద‌రూ ప్ర‌భుత్వ ఉద్యోగులైతే భార్య ఉన్న ప్రాంతానికి భ‌ర్త ట్రాన్స‌ఫ‌ర్ అవ్వాల‌నుకుంటే మ్యారేజ్ స‌ర్టిఫికేట్‌, జీవిత భాగస్వామి సర్టిఫికేట్, ఎంప్లాయి ఐడీతో ఎంప్లాయి అథారైజేష‌న్ లెట‌ర్‌, భార్య ఆధార్ కార్డు, నో డ్యూస్ స‌ర్టిఫికేట్ తీసుకెళ్లాలి. మ్యూచువ‌ల్ (పరస్పరం) అంగీకారంతో బ‌దిలీ కావాల‌నుకుంటే నో డ్యూస్ స‌ర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌రరావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

టాపిక్