Registrations DIG: భార్య, కొడుకుపై దాడి చేసిన రిజిస్ట్రేషన్స్ డీఐజీ కిరణ్‌కుమార్, కేసు నమోదు
Registrations DIG: భార్యను వేధించి దాడి చేసిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. నెల్లూరులో డీఐజీ హోదాలో ఉన్న కిరణ్‌కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు.

Registrations DIG: ఉన్నత ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వ అధికారి వివాహేతర సంబంధంతో భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. ఆమెను చితకబాదడంతో గాయాలపాలైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నెల్లూరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించి వెళ్లి చేసుకున్న భార్యను దారుణ హింసలకు గురి చేసిన ఘటనలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారిపై గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త తనను చితకబాదాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సోమవారం రాత్రి గుంటూరు అరండల్‌పేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ప్రస్తుతం సెలవులో ఉన్నార. ఎల్‌ఐసిలో ఆసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న అనసూయరాణిని కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
కిరణ్-అనసూయ దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ అనసూయపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయారు. దీంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత బాధితురాలు గుంటూరు అరండల్ పేట పీఎస్‌లోఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ కుమార్ గతంలో గుంటూరులో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డీఐజీగా విధులు నిర్వహించారు.
ప్రేమ పెళ్లి చేసుకుని…
కిరణ్‌తో తాను ప్రేమ వివాహం చేసుకున్నామని బాధితురాలు అనసూయ పేర్కొన్నారు. పిల్లలు పుట్టకపో వటంతో ఓ పాపను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా 2012లోఓ బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన భర్త కొన్నేళ్లుగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు.
భర్త పెట్టే వేధింపులు తాళలేక పది నెలల నుంచి ఇద్దరం వేర్వేరుగా ఉంటున్నట్లు వివరించారు. తమ కుమార్తె విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటు న్నాడని ఆమె చెప్పారు. రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్తుంటే తమను అడ్డుకుని బాబును, తనను కిరణ్ కుమార్ తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.