Vizag Real Estate : విశాఖపట్నంలో భూములు బంగారం.. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే తిరుగు ఉండదు!
Vizag Real Estate : విశాఖపట్నం.. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. ఇక్కడ పరిశ్రమలు, ఐటీ రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో.. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటోంది. పలు ప్రాంతాల్లో భవిష్యత్తులో భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వైజాగ్. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి. పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయి. ఐటీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. దీంతో విశాఖ చుట్టుపక్కల భూముల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో భూములపై పెట్టుబడి పెడితే.. భవిష్యత్తు బంగారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
9 ముఖ్యమైన అంశాలు..
1.భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది. దీంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా చాలా ముఖ్యమైనదిగా మారుతోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నందున నివాస, వాణిజ్య స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. అనందపురం, తగరపువలస వంటి ప్రాంతాలు కూడా భోగాపురానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి చెందుతున్నాయి.
2.మధురవాడ..ఇది విశాఖపట్నంలోని ప్రధాన ఐటీ హబ్. ఇక్కడ అనేక ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థుల కోసం నివాస స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ భూముల రేట్లు స్థిరంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.
3.యెండాడ కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ అనేక రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇది ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండటంతో ఉద్యోగులకు అనుకూలమైన ప్రాంతంగా మారింది. ప్రశాంతమైన వాతావరణం, మంచి కనెక్టివిటీ ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో భూముల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
4. గాజువాక, కూర్మన్నపాలెం.. గాజువాక ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ అనేక పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. కూర్మన్నపాలెం కూడా గాజువాకకు దగ్గరగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో నివాస స్థలాలకు డిమాండ్ ఉంటుంది.
5.పెందుర్తి, సబ్బవరం..ఈ ప్రాంతాలు నగరానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ.. ఇక్కడ తక్కువ ధరలకు భూములు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో నగర విస్తరణ జరిగే అవకాశం ఉండటంతో ఇక్కడ కూడా భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది.
6.ఆనందపురం.. ఇది ఐటీ హబ్‌కు, భోగాపురం విమానాశ్రయానికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఫలితంగా భూములకు డిమాండ్ ఏర్పడింది.
7.కొత్తవలస.. ఇది కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ డీటీసీపీ, వుడా ఆమోదిత లేఅవుట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి భూములు భవిష్యత్తులో మంచి రాబడినిచ్చే అవకాశం ఉంది.
8.విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టే ముందు.. ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు (రోడ్లు, నీరు, విద్యుత్, రవాణా సౌకర్యాలు మొదలైనవి) పరిశీలించడం ముఖ్యం.
9.ప్రభుత్వ విధానాలు, నగర విస్తరణ ప్రణాళికలు కూడా భూముల రేట్లపై ప్రభావం చూపుతాయి. నిపుణుల సలహా తీసుకోవడం, ప్రాపర్టీ చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం.
సంబంధిత కథనం