ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం-rbi regional office opened soon in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం

HT Telugu Desk HT Telugu
May 20, 2022 01:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో త్వరలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్‌ కరాడ్‌ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌‌కు రాసిన లేఖలో ఆ విషయాన్ని తెలిపారు.

నార్త్‌బ్లాక్‌లోని ఆర్ధిక శాఖ కార్యాలయం
నార్త్‌బ్లాక్‌లోని ఆర్ధిక శాఖ కార్యాలయం (Sanjay Sharma)

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ఆ శాఖ సహాయ మంత్రి బదులిచ్చారు. అమరావతి ప్రాంతంలో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉందని ఏప్రిల్ 5న రాజ్యసభ జీరో అవర్‌లో ప్రశ్నించారు. దీనికి స్పందనగా అమరావతి ప్రాంతంలో కంప్ట్రోలర్‌ అండ్ ఆడిట్ జనరల్ కార్యాలయంతో పాటు, రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.

 ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రత్యేకంగా ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు రిజర్వ్‌ బ్యాంక్ కేంద్రానికి సమాచారమిచ్చింది. త్వరలోనే ఆర్‌బిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కావాల్సిన కార్యాలయాల గురించి కేంద్ర ప్రభుత్వంతో పాటు కాగ్‌ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల ఏర్పాటు కోసం భూకేటాయింపులు జరిపారు. కేంద్ర ప్రభుత కార్యాలయాలతో పాటు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు సొంతంగా భూముల్ని కొనుగోలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజదాని వికేంద్రీకరణ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఏపీకి రావాల్సిన కార్యాలయాల విషయంలో ప్రతిష్టంబన నెలకొంది. పరిపాలన రాజధాని విశాఖపట్నం తరలిపోతుందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌‌లో కార్యలయాల ఏర్పాటును వాయిదా వేసుకున్నాయి. కొన్ని సంస్థలు కొనుగోలు చేసిన భూముల్ని ఖాళీగా వదిలేశాయి. రక్షణ సంస్థలతో పాటు, పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్‌ రేటుకు భూముల్ని విక్రయించారు. ఈ నేపథ్యంలో భూములు దక్కించుకున్న సంస్థలు కార్యలయాలను ప్రారంభించాల్సిందిగా టీడీపీ ఎంపీ పార్లమెంటులో ప్రశ్న లేవనెత్తారు

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్