ఏపీలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మరోవైపు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38డిగ్రీల నుంచి 40డిగ్రీల మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉంది.
రాయలసీమలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉంటుంది.
తిరుపతి,చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, చిత్తూరు కర్నూలు,నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి, తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి,కోనసీమ,కృష్ణా, గుంటూరు,పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం రాత్రి 7 గంటల నాటికి అల్లూరి జిల్లా ఏటపాకలో 41.2మిమీ, మన్యం జిల్లా కురుపాంలో 36.7మిమీ, ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో 33.5మిమీ వర్షపాతం రికార్డు అయినట్లు తెలిపారు.
మరోవైపు సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా బుట్టాయిగూడెంలో 38.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
సంబంధిత కథనం