AP Ration Dealer Jobs : ఏపీలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ - 192 ఖాళీలు, చివరి తేదీ ఎప్పుడంటే..!-ration dealer posts notification released in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Dealer Jobs : ఏపీలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ - 192 ఖాళీలు, చివరి తేదీ ఎప్పుడంటే..!

AP Ration Dealer Jobs : ఏపీలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ - 192 ఖాళీలు, చివరి తేదీ ఎప్పుడంటే..!

HT Telugu Desk HT Telugu
Nov 20, 2024 04:00 PM IST

AP Ration Dealers : ఏపీలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు న‌వంబ‌ర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. చీరాల‌, రేప‌ల్లె రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో మొత్తం 192 రేష‌న్ డీల‌ర్లను నియామించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…

ఏపీలో రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీలో రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ డీల‌ర్ల నియామ‌కానికి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజ‌న్‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది.  ఈ నోటిఫికేష‌న్ కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి పాస్ అభ్య‌ర్థులు అప్లై చేసుకోవ‌చ్చు. చీరాల‌, రేప‌ల్లె రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని మొత్తం 192 రేష‌న్ డీల‌ర్ల నియామ‌కం, దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు ఈనెల 28 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.

రేప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ఖాళీగా ఉన్న 46 రేష‌న్ డీల‌ర్లు, మూడు బై ఫ‌ర‌గేష‌న్ (విభ‌జిత‌) దుకాణాలు మొత్తం 49 రేష‌న్ డీల‌ర్లు, దుకాణాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లు ఆర్డీవో నేల‌పు రామ‌ల‌క్ష్మి తెలిపారు. రేప‌ల్లె పట్ట‌ణం, మండ‌లంలో 8, న‌గ‌రంలో 8, చుండూరులో 8, చెరుకుప‌ల్లిలో 6, నిజాంప‌ట్నంలో 5, భ‌ట్టిప్రోలులో 5, అమ‌ర్త‌లూరులో 3, కొల్లూరులో 3, వేమూరులో 3 చొప్ప‌న భ‌ర్తీ చేస్తున్న‌ట్లు తెలిపారు.

అలాగే చీరాల రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌ది మండ‌లాల్లో 139 రెగ్యుల‌ర్ డీల‌ర్ షాప్‌లు, 4 కొత్త షాప్‌లు మొత్తం 143 రేష‌న్ దుఖాణాలు, డీల‌ర్ల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు చీరాల ఆర్డీవో పి.చంద్ర‌శేఖ‌ర్ నాయుడు తెలిపారు.

విద్యా అర్హ‌త‌...వ‌యో ప‌రిమితి

రేప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ఖాళీగా ఉన్న రేష‌న్ డీల‌ర్లు, బై ఫ‌ర‌గేష‌న్ దుకాణాల భ‌ర్తీ చేయ‌డానికి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా అర్హ‌త‌ను నిర్ణ‌యించారు. డీల‌ర్ పోస్టుకు, దుకాణానికి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండ‌కూడ‌దు. 

చ‌దువుతున్న‌వారు, విద్యా వ‌లంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా ప‌ని చేస్తున్న‌వారు, ఆశ కార్య‌క్త‌లు ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అన‌ర్హులు. అలాగే వ‌య‌స్సు 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్డ్వ్ కేట‌గిరీకి చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యించిన మిన‌హాయింపు ఉంటుంది.

పూర్తి షెడ్యూల్…

అభ్య‌ర్థులు న‌వంబ‌ర్ 28వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. న‌వంబ‌ర్ 29న ద‌ర‌ఖాస్తుల ప‌రిశీలించ‌నున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన వారికి డిసెంబ‌ర్ 2న రాత ప‌రీక్ష‌ నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష‌కు సంబంధించి హాల్ టికెట్స్ న‌వంబ‌ర్ 30న జారీ చేస్తారు. డిసెంబ‌ర్ 3న రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌చురిస్తారు. రాత ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు డిసెంబ‌ర్ 5న ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. డిసెంబ‌ర్ 6న ఎంపికైన వారి తుది జాబితాను విడుద‌ల చేస్తారు.

జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ఇంట‌ర్మీడియ‌ట్‌, ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త స‌ర్టిపికేట్లు

2,. వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

3. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ప‌ర్వాలేదు)

4. మూడు పాస్‌పోట్ సైజ్ పోటోలు

5. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

6. నిరుద్యోగిగా ఉన్న‌ట్లు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

7. దివ్యాంగుల కేట‌గిరికి చెందిన వారైతే సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయాలి.

రేప‌ల్లె, చీరాల రెవెన్యూ డివిజ‌న్ల‌కు సంబంధించి డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా ఆర్డీవో కార్యాల‌యాల్లో స‌మ‌ర్పించాలి. న‌వంబ‌ర్ 28 తేదీ లోపు ద‌ర‌ఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుతో పాటు సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయడం త‌ప్ప‌ని స‌రి. ఇత‌ర వివ‌రాల కోసం రేప‌ల్లె, చీరాల‌ ఆర్డీవో కార్యాల‌యాల‌ను సంప్ర‌దించాల‌ని ఆర్డీవోలు నేల‌పు రామ‌ల‌క్ష్మి, పి.చంద్ర‌శేఖ‌ర్ నాయుడు తెలిపారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner