ద్రోణి ప్రభావం, ఆపై ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు-rains likely in andhrapradesh and telangana for a few more days imd weather updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ద్రోణి ప్రభావం, ఆపై ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు

ద్రోణి ప్రభావం, ఆపై ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చు.

ద్రోణి ప్రభావం… కొనసాగుతున్న ఆవర్తనం

అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం….. ఒక ద్రోణి దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి ఈశాన్య బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. అక్కడ్నుంచి ఒడిశా, జార్ఖండ్ దానికి అనుకుని ఉన్న దక్షిణ బీహర్, బెంగల్ ఉత్తర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. అంతేకాకుండా ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు దానికి అనుకుని ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇప్పుడు సగట్టు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ మధ్య విస్తరించి ఉంది.

ఏపీలో వర్షాలు…

ఉత్తర కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయి. 40- 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి ఉండనున్నాయి.

దక్షిణ కోస్తాలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయి. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక రాయలసీమలో చూస్తే... ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. రేపు ఎల్లుండి చూస్తే... కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఇక రాగల రెండు రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతల నమోదులో క్రమంగా 2- 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ తర్వాత గణనీయమైన మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది.

తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు…

తెలంగాణలో చూస్తే ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతా్లలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు (జూన్ 06) జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.