ఏపీ, తెలంగాణకు వాతవరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మరికొన్ని రోజులు పాటు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఆదివారం(12-10-25) అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతవరణ కేంద్రం వివరాల ప్రకారం... ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు.
ఇక రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
అక్టోబర్ 14వ తేదీన ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
సంబంధిత కథనం