Rain Alert To AP : ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం-rain alert to andhra pradesh for coming days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rain Alert To Andhra Pradesh For Coming Days

Rain Alert To AP : ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 04:46 PM IST

Andhra Pradesh Weather Alert : ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబరు 29 నుంచి వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు(AP Rains) కురుస్తాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుపాను స్థిరంగా కొనసాగుతూ గంటకు 21 కి.మీ వేగంతో ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోంది. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. అక్టోబర్ 29 నుంచి వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయి. ఒకవైపు వర్షాలు తగ్గుముఖం పట్టినా.. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి.

ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు(Rains) కురుస్తుండగా, తెలంగాణ(Telangana)లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ సిత్రంగ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే బెంగాల్‌లోని సుందర్‌బన్ తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసిన ఎన్‌డిఆర్‌ఎఫ్(NDRF) బృందాలు సహాయక చర్యల కోసం బెంగాల్‌తో పాటు అస్సాంలో ఇప్పటికే రంగంలోకి దిగాయి.

ఈశాన్య రుతుపవనాల వానలు త్వరలో ప్రారంభమవుతాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా ఉంటాయి. శ్రీలంక(Sri Lanka), మధ్య తమిళనాడు(Tamil Nadu) మీదుగా అల్పపీడనం ఏర్పడుతుంది. ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ చివరిలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు వర్షాలు తగ్గినా.. రాత్రివేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

సిత్రాంగ్ తుపాను(Cyclon Sitrang) కారణంగా తెలంగాణలో వర్షాలు ఎక్కువగా లేకున్నా.. చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భాగ్యనగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు నమోదు అయింది. ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం