Weather Updates: ఆంధ్రాకు వర్షసూచన.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం-rain alert for four days to andhra pradesh and telangana states by imd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rain Alert For Four Days To Andhra Pradesh And Telangana States By Imd

Weather Updates: ఆంధ్రాకు వర్షసూచన.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం

HT Telugu Desk HT Telugu
Mar 16, 2023 08:17 AM IST

Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‍హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడింది.ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఉండటంతో వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.

ఏపీ తెలంగాణల్లో వర్ష సూచన
ఏపీ తెలంగాణల్లో వర్ష సూచన

Weather Updates: బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రాలో వర్షాలు కురిసేఅవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణితో పాటు ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఏర్పడటంతో వాటి ప్రభావం ఏపీ మీద ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రాతో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. బుధవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం నేపథ్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, డా.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. 17,18,19 తేదీలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

వరుసగా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అమరావతి విభాగం అంచనా వేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం ఒకరోజు ముందుగానే వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది.

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..

, ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాలను కూడా వేసింది వాతావరణశాఖ.. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదా­వరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇదే సమయంలో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ సమయంలో.. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు­గాలు­లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

IPL_Entry_Point