AP TG Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్- రేపు ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు-rain alert for ap telangana thunderstorms lightning expected tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్- రేపు ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు

AP TG Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్- రేపు ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు

AP TG Rains : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రేపు(ఆదివారం) ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు హెచ్చరించారు. పలుచోట్ల ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్- రేపు ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు

AP TG Rains : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తు్న్నాయి. రేపు(ఆదివారం) ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై ఉండి పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్లు పోల్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.

మరోవైపు రేపు(ఆదివారం) మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట, అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో మొత్తంగా ఆరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం కర్నూలు జిల్లా ఆస్పరి, శ్రీ సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా ఒరవోయ్ లో 34 మి.మీ, వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లి 27 మి.మీ, ముద్దనూరులో 19.7 మి.మీ, కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 18.7 మి.మీ వర్షపాతం, 17 ప్రాంతాల్లో 10 మి.మీకు పైగా వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రేపు(ఆదివారం) తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈ నెల 24వ తేదీన రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు(గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

శనివారం వడగండ్ల వానలు

కామారెడ్డిలో శనివారం వడగండ్ల వాన పడింది. చద్మాల్ తండా, నేరల్ తండా, గుర్జాల్ గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. వడగండ్ల వర్షం కాణంగా మొక్కజొన్న పొలాల్లో నీరు చేరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు.

వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో మోమిన్ పేట, నవాబుపేట మండలాల్లో శనివారం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో నవపేట మండలం చిట్టిగిద్ద గ్రామసమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో కొద్ది సమయం రాకపోకలు నిలిచాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వడగండ్ల వాన కురిసింది. శనివారం సాయంత్ర గంటపాటు కురిసిన వర్షానికి జహీరాబాద్ లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం