IRCTC Package : ఏపీ, తెలంగాణ నుంచి మహా కుంభమేళాకు రైల్వే ప్యాకేజీ.. బెస్ట్ ఆప్షన్ ఇదే!-railway package from andhra pradesh and telangana to maha kumbh mela ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Package : ఏపీ, తెలంగాణ నుంచి మహా కుంభమేళాకు రైల్వే ప్యాకేజీ.. బెస్ట్ ఆప్షన్ ఇదే!

IRCTC Package : ఏపీ, తెలంగాణ నుంచి మహా కుంభమేళాకు రైల్వే ప్యాకేజీ.. బెస్ట్ ఆప్షన్ ఇదే!

IRCTC Package : తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా వెళ్తారు. వారి కోసం రైల్వే మంచి ప్యాకేజీ ప్రకటించింది. అన్ని సౌకర్యాలు ఈ ప్యాకేజీలో ఉంటాయి. వారం పాటు టూర్ ఉంటుంది.

కుంభమేళాకు రైల్వే ప్యాకేజీ

మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ మీదుగా వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య మధ్య ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. వచ్చేనెల 5 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్యాకేజీ ఉంటుంది. ఫిబ్రవరి 5న చెన్నైలోని తిరునల్వేలిలో ఈ ప్రత్యేక రైలు బయలుదేరుతుంది.

ప్యాకేజీ వివరాలు..

ఫిబ్రవరి 6వ తేదీన విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి మహా కుంభమేళాకు వెళుతుంది. ఫిబ్రవరి 10వ తేదీన తిరిగి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా.. అల్పాహారం, భోజనం, ఏసీ, నాన్‌ ఏసీ హోటల్స్, రవాణా, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయి. అన్నింటికి కలిపి టికెట్‌ ధర ఒక్కొక్కరికీ స్లీపర్‌ క్లాస్‌కు అయితే రూ.26,850, థర్డ్‌ ఏసీలో రూ.38,470, సెకండ్‌ ఏసీకి రూ.47,900 ఉంటుంది. ఈ ప్యాకేజీ టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం 90031 40680, 82879 31964 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

సికింద్రాబాద్ నుంచి..

సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు రైలు అందుబాటులో ఉంది. SCZBG34 కోడ్‌తో ఈ టూర్ ఉంటుంది. ఈనెల 20వ తేదీన ఈ టూర్ ప్రారంభం కానుంది. మొత్తం 7 రాత్రులు, 8 డేస్ ఉంటుంది. వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యకు ఈ ట్రైన్ వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తుని, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో బోర్డింగ్‌కు అవకాశం ఇచ్చారు.

టికెట్ రేట్లు ఇలా..

ఈ ట్రైన్‌లో ఎకనామీ (స్లీపర్ క్లాస్) ధర పెద్దలకు రూ.22,635, పిల్లలకు రూ.21,740 ఉంటుంది. స్టాండర్డ్ (థర్డ్ ఏసీ) ధర పెద్దలకు రూ.31,145, పిల్లలకు రూ.30,095 ఉంటుంది. కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ) ధర పెద్దలకు రూ.38,195, పిల్లలకు అయితే రూ.36,935 ఉంటుంది. వీటిల్లోనే టిఫిన్, భోజనం, ఏసీ, నాన్‌ ఏసీ హోటల్స్, రవాణా, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయి. మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఈ రైలు నడుస్తుంది.