Jodo Yatra in AP: ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ జోడో యాత్ర..-rahul gandhi jodo yatra to enter in andhrapradesh on 14 october 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rahul Gandhi Jodo Yatra To Enter In Andhrapradesh On 14 October 2022

Jodo Yatra in AP: ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ జోడో యాత్ర..

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 04:10 PM IST

Jodo Yatra in andhrapradesh : ఈ నెల 14 నుంచి రాష్ట్రంలో భారత్​ జోడో యాత్ర జరగనుందని కాంగ్రెస్​ పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మస్తాన్​వలి తెలిపారు. జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ జోడో యాత్ర
రాహుల్ గాంధీ జోడో యాత్ర (twitter)

Rahul gandhi Jodo yatra in AP: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రసుత్తం కర్ణాటకలో కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 14 వ తేదీన ఏపీలోకి జోడో యాత్ర ఎంట్రీ కానుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4 రోజుల పాటు 90 కిలో మీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర నిర్వహణపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నేతలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఊమెన్ చాందీ, పార్టీ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు సమీక్షించారు. ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై చర్చించారు. భారత్‌ జోడో యాత్రకు సంబంధించి ఇవాళ గుంటూరులో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి పోస్టర్లు రిలీజ్ చేశారు. రాష్ట్రంలో జరిగే జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఇలా….

Bharat Jodo Yatra in Telangana: ఇప్పటివరకు ఖరారైన యాత్ర షెడ్యూల్ ప్రకారం... అక్టోబర్‌ 24న రాహుల్‌ కర్ణా టకలోని రాయచూర్‌ నియో జకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్‌ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు. మక్తల్‌ నియోజక వర్గంలోని కృష్ణ మండలం గుడ వల్లూరు గ్రామం వద్ద ఆయన రాష్ట్రంలోకి వస్తారు. అక్కడి నుంచి దేవరక్రద, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి,జోగి పేట, శంకరంపేట, మద్నూరుల మీదుగా మహా రాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తారు. మొత్తం మీద 15 రోజుల పాటు 366 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది. 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. రాహుల్ యాత్రను విజయంతం చేసే దిశగా రాష్ట్ర నేతలు కూడా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయితే అక్టోబర్ 4న అధిష్టానం తుది రూట్ మ్యాప్‌ను ఖరారు చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక తెలంగాణలో సాగే యాత్రలో భాగంగా.. పలు అధ్యాత్మిక ప్రాంతాలను రాహుల్ సందర్శించేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రముఖ దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని ద‌ర్శించుకొని స్వామి ఆశీస్సులు రాహుల్‌ పొంద‌నున్నారు. అటు త‌ర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌ మెద‌క్ చ‌ర్చికి వెళ్తారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న జ‌హంగీర్ ద‌ర్గాను కూడా సంద‌ర్శిస్తార‌ని భార‌త్ జోడో యాత్ర వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా బీజేపీ దేశంలో చేస్తున్న మ‌త విభ‌జ‌న రాజ‌కీయాల‌కు గట్టి సమాధానం ఇచ్చిన‌ట్టువుతుంద‌ని కాంగ్రెస్ అంచ‌నాలు వేసుకుంటుంది.

IPL_Entry_Point