Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారంపూడి ఎవ్వరినీ వదలం, మెడపట్టి లోపలికి తోస్తాం- నాగబాబు సంచలన వ్యాఖ్యలు-punganur janasena nagababu sensational comments on peddireddy jagan ysrcp leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారంపూడి ఎవ్వరినీ వదలం, మెడపట్టి లోపలికి తోస్తాం- నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారంపూడి ఎవ్వరినీ వదలం, మెడపట్టి లోపలికి తోస్తాం- నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Feb 02, 2025 09:44 PM IST

Nagababu : సామాజిక మాధ్యమాల్లో, ఇళ్లల్లో కూర్చొని కాదు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని వైసీపీ ఎమ్మెల్యేలకు నాగబాబు సవాల్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు జారి... ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారన్నారు. పెద్దిరెడ్డి ఎవరెవరి ఆస్తులైతే కబ్జా చేశారో అన్నీ బయటకు తీస్తామన్నారు.

పెద్దిరెడ్డి, జగన్, ద్వారంపూడి ఎవ్వరినీ వదలం, మెడపట్టి లోపలికి తోస్తాం- నాగబాబు సంచలన వ్యాఖ్యలు
పెద్దిరెడ్డి, జగన్, ద్వారంపూడి ఎవ్వరినీ వదలం, మెడపట్టి లోపలికి తోస్తాం- నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Nagababu : పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు డిమాండ్ చేశారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన ఆయన...వైసీపీపై విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు జారి... ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో, ఇళ్లల్లో కూర్చొని కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. ఖనిజాలను దోచుకునే మాఫియా అంతు చూస్తానని ప్రధాని మోదీ కలికిరిలో చేసిన ప్రకటన త్వరలోనే అమలవుతుందని అన్నారు.

వైసీపీ ఏమైనా రామరాజ్యం నడిపిందా?

"పెద్దిరెడ్డి తాను దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించారు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు అని సీఐడీ అధికారులు నిర్థారించారు.

ప్రజలను వైఎస్ జగన్ భ్రమల్లో ఉంచుదాం అని ప్రయత్నిస్తున్నారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇంకో ఒకటి, రెండేళ్లలో వైసీపీ నాయకులందరూ వారి అక్రమాలకు, నేరాలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. వైసీపీ ఏమైనా రామరాజ్యం నడిపిందా? 11 సీట్ల నుంచి సింగిల్ డిజిట్ కి పడరని గ్యారెంటీ ఏంటి?" అని నాగబాబు అన్నారు.

"మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎవరెవరి ఆస్తులైతే కబ్జా చేశారో అన్నీ బయటకు తీస్తాం. కూటమి కార్యకర్తలకు అసంతృప్తి ఉంది వీరి మీద చర్యలు తీసుకోవట్లేదని, అందరి మీద చర్యలు తీసుకుంటాం. ముందు ప్రజల బాగోగులు చూసుకోడం ముఖ్యం, సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి, వైఎస్ జగన్, ద్వారంపూడితో సహా అందరిపైనా చర్యలు తీసుకుంటాం. ఎవ్వరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ప్రతీ ఒక్కరినీ మెడపట్టి లోపలికి తోస్తాం" -జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

అక్రమార్కులను న్యాయస్థానంలో నిలబెడతాం

వైసీపీకి 11 సీట్లు ఇచ్చి గెలిపించిన 20 లక్షల మందికి పైగా ప్రజల గొంతుకను శాసనసభలో వినిపించకుండా మోసం చేస్తున్నారని నాగబాబు విమర్శించారు. సభలో మైకు ఇవ్వరని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సభకు హాజరైతే కదా మైకులు ఇస్తారా, లేదా అని తెలిసేదని అన్నారు. శాసనసభకు హాజరు కాకపోగా కూటమి ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ, చీకట్లో బాణాలు వేస్తున్నారన్నారు.

వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు అన్నీ వెలికి తీసి న్యాయస్థానంలో నిలబెడతామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తోందన్నారు.

గత ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పటికీ, పిఠాపురంలో పూర్తి సమయం కేటాయించాల్సిన కారణంగా పుంగనూరు రాలేక పోయానని, ఇకపై అవకాశం దొరికినప్పుడల్లా పుంగనూరు వస్తానని అన్నారు.

Whats_app_banner