Modi Visakha Tour: జనవరి8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీ
Modi Visakha Tour: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆర్నెల్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు కొత్త ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో చర్చించారు.
Modi Visakha Tour: ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8వ తేదీన విశాఖపట్నం రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని రానుండటంతో ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ ఆర్నెల్ల విజయాలను ప్రధానికి వివరించేందుకు సిద్ధం అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖపట్నం రానున్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ విశాఖపట్నంలో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎన్‌టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటుకు శంకుస్థాపన, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. .
ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధా సంలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో ఇప్పటికే సభాస్థలంలో పనులు ప్రారంభించారు. మరోవైపు ప్రధాని పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లపై మంత్రులతో ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో చర్చించారు.
నేవీ డే పరేడ్‌కు ముఖ్యమంత్రి..
విశాఖలో జనవరి 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్‌కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అదేరోజు ప్రదాని సభ ఏర్పాట్లపై సమీక్షించే అవకాశం 4వ తేదీ రాత్రి తిరిగి విజయవాడ వెళ్లిపోతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 8న ప్రధానితోపాటు ఏయూలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
సంబంధిత కథనం