Prakasam Crime : ప్రకాశం జిల్లాలో ఘోరం, నాలుగో తరగతి చిన్నారిపై పెద్దనాన్న లైంగిక దాడి
Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు కూతురయ్యే చిన్నారిపై పెద్దనాన్న లైంగిక దాడికి చేశాడు. గ్రామంలో పోలీసులు నిర్వహించిన గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ కార్యక్రమంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Prakasam Crime : ప్రకాశం జిల్లాలో ఘోరమైన సంఘటన చోట చేసుకుంది. వరుసకు కూతురయ్యే చిన్నారిపై లైంగిక దాడి చోటు చేసుకుంది. గ్రామంలో పోలీసులు నిర్వహించిన గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ కార్యక్రమంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా ఒక మానవ మృగం కూతురు వరసైన ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఓ చిన్నారి నాలుగో తరగతి చదువుతోంది. ఆ చిన్నారిపై తన సొంత పెద్దమ్మ భర్త కన్నేశాడు. చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడి, మానవ మృగంలా ప్రవర్తించాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఆ బాలికను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయంతో ఎవరికి చెప్పలేదు. చివరికి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా తనలోనే తాను మదనపడేది.
ఆ మానసిక బాధను భరించలేకపోయింది. ఇటీవలి గ్రామంలోని పాఠశాలలో పోలీసులు, ఉపాధ్యాయులు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ మీద అవగాహన కల్పిస్తున్న సమయంలో ఆ విద్యార్థిని తమ తరగతి ఉపాధ్యాయురాలికి ఈ విషయం చెప్పింది. దీంతో వారు చిన్నారి తల్లిదండ్రులు విషయం చెప్పారు. అయితే సొంత బంధువులు కావడంతో విషయం బయటకు పొక్కుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఈ విషయం ఆనోటా, ఈనోటా చేరి బయటకు పొక్కింది.
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చర్యలు చేపట్టనున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే తెలిసిన వెంటనే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నా పోలీసుల వైఖరిపై విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం