Prakasam Crime : భర్త మర్మాంగాన్ని కోసేసిన రెండో భార్య, కారణం తెలిస్తే షాక్!
Prakasam Crime : భార్యాభర్తల మధ్య గొడవ కత్తిదాడికి దారితీసింది. తనను సరిగ్గా పట్టించుకోవడంలేదని గొడవ పడి మద్యం మత్తులో ఉన్న భర్త మర్మాంగాన్ని కోసేసింది భార్య. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడు బీహార్ రాష్ట్రానికి చెందివాడని పోలీసులు గుర్తించారు.
Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్దదై...భార్య భర్త మర్మాంగాన్ని కోసేసింది. అనంతరం భయంతో తాను పనిచేస్తున్న డెయిరీ ఫామ్ యజమానికి ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి చెప్పి అక్కడి నుంచి పరారైంది. దీంతో యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. బాధితుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన విజయ్ యాదవ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులోని ఓ డెయిరీ ఫామ్‌లో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న బీహార్‌కే చెందిన సీతాకుమారి అనే మహిళతో విజయ్ యాదవ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే విజయ్ యాదవ్ అప్పటికే వివాహం కాగా, తన భార్యను బీహార్‌లో ఉంచాడు. ఏపీలో సీతాకుమారితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఆమె గర్భవతి కాగా...అప్పటి నుంచి విజయ్ యాదవ్ లో మార్పు వచ్చిందని, తనను పట్టించుకోవడంలేదని ఆమె తరచూ గొడవ పడుతుండేది.
భర్తపై కత్తితో దాడి
శనివారం రాత్రి వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. గొడవ పెద్దదై మద్యం మత్తులో ఉన్న విజయ్ యాదవ్ పై సీతాకుమారికి కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో విజయ్ మర్మాంగాన్ని కోసేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ విజయ్‌ను చూసి భయంతో డెయిరీ ఫామ్ యజమానికి సమాచారం ఇచ్చి సీతాకుమారి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన విజయ్ యాదవ్ ను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సీతాకుమారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్ణాటకలో మరో ఘటన
కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని భర్త చెప్పడంతో అలిగిన ఆ మహిళ, అతడిపై వెధింపుల కేసు పెట్టింది. కాగా ఈ విషయంపై పోలీసుల దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సదరు మహిళ ఐపీసీ సెక్షన్ 498ఏ, 504, వరకట్న నిషేధ చట్టం కింద భర్తపై ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ వ్యక్తిపై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అమెరికాలో వర్క్ చేసే అతడిని విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు.
ఈ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. తిరిగి అమెరికా వెళ్లాలన్న భర్త అభ్యర్థనను జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆమోదించారు. సెప్టెంబర్ 21న తదుపరి విచారణ వరకు ఎల్ఓసీపై స్టే విధించిన ఆయన అఫిడవిట్ని సమీక్షించిన తర్వాత మహిళ భర్తను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించారు. భవిష్యత్ విచారణకు అందుబాటులో ఉంటానని తన అఫిడవిట్లో ఆ వ్యక్తి హామీ ఇచ్చినట్టు న్యాయమూర్తి గుర్తించారు. ప్రసవం తర్వాత అధిక రక్తపోటును ఎదుర్కొన్నప్పుడు, బరువు పెరుగుతానేమో అన్న ఉద్దేశంతో తన భర్త, తనని ఫ్రెంచ్ ఫ్రైస్, అన్నం, మాంసం తినకుండా అడ్డుకున్నట్టు సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు డెలివరీ తర్వాత తన భార్య ఇంటిని పట్టించుకోవడం లేదని ఆ వ్యక్తి అన్నాడు. ఇంటి పనులు, రోజువారీ పనులకు తాను మాత్రమే బాధ్యత వహిస్తున్నట్టు, తన భార్య ఎక్కువ సమయం టీవీ చూడటం, ఫోన్స్ చేయడంలో గడుపుతోందంటూ భర్త కోర్టుకు తెలిపాడు.
ఐపీసీ సెక్షన్ 498ఏలో చెప్పినట్టు ఇక్కడ నేరం జరిగిన ఆధారాలు లేవని జస్టిస్ నాగప్రసన్న తన తీర్పులో పేర్కొన్నారు. దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన నొక్కి చెప్పారు. దీంతో ట్రావెల్ అరేంజ్మెంట్ గురించి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు తెలియజేయాలని, భర్తకు ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేకుండా చూడాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
సంబంధిత కథనం