Prakasam Crime : ప్రేమ పేరుతో మైనర్‌ను మోసం చేసిన యువకుడు-పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
Prakasam Crime : ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడో యువకుడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, యువకుడ్ని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను ఒక యువకుడు మోసం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, యువకుడిని పట్టుకుని, బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జరుగుమల్లి మండలంలోకి ఒక గ్రామానికి చెందిన ఓ బాలిక (16) ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుతోంది. టంగుటూరుకి చెందిన సుంకర రామస్వామి (22) స్థానికంగా ఉండే ద్విచక్ర వాహనం షోరూంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. పాఠశాలలో చదువుతుండగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.
దీంతో బాలికతో మాటలు కలిపాడు. కొంత కాలంగా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆమెకు రామస్వామి మాయ మాటలు చెప్పి ఈనెల 10న ఇంటి నుంచి తీసుకెళ్లాడు. బయటకు వెళ్లిన కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమ కుమార్తె బయటకు వెళ్లి, ఇంకా ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.
అనంతరం దర్యాప్తు చేపట్టి ఆ యువకుడు రామస్వామి వద్ద బాలిక ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు రామస్వామి ఎక్కడున్నాడో తెలసుకుని అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు రామస్వామిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిగింది.
బాలికపై లైంగిక దాడి... రౌడీ షీటర్‌పై పోక్సో కేసు
విశాఖపట్నం కొబ్బరితోట ప్రాంతానికి చెందిన బాలికను మోసం చేసిన రౌడీ షీటర్‌పై శుక్రవారం విశాఖపట్నం టూ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం టూ టౌన్ పరిధిలో నివాసం ఉండే బాలిక కనిపించడం లేదని ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టారు.
ఈనెల 20న బాలిక విజయనగరంలో ఉందని గుర్తించారు. బాలికను తీసుకొచ్చి విచారించారు. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ దినేష్ మాయమాటలతో విజయనగరం తీసుకెళ్లాడని, అక్కడ ఓ ఇంట్లో తన ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం