Andhra Pradesh Politics : రాజకీయాలు ప్లస్ భక్తి.. ఇప్పుడు ఏపీలో కొత్త మంత్రం-politics plus devotion new mantra in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Politics Plus Devotion New Mantra In Andhra Pradesh

Andhra Pradesh Politics : రాజకీయాలు ప్లస్ భక్తి.. ఇప్పుడు ఏపీలో కొత్త మంత్రం

Anand Sai HT Telugu
Oct 06, 2022 09:28 AM IST

Capital Amaravati Issue : ఏపీ రాజకీయాలు మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇవీ భక్తి వైపు వెళ్తున్నాయి. భక్తితో కలిపిన రాజకీయం జరుగుతోంది. రాజకీయాలతో భక్తిని కలపడం కొత్త మంత్రంగా కనిపిస్తోంది.

రాజధాని అమరావతి
రాజధాని అమరావతి

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు మూడు రాజధానులు ఉండాలన్న సంకల్పంపై ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, రైతులు కూడా భక్తినే కనబరుస్తున్నారు. బుధవారం విజయ దశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు, కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSR Congress Party). వికేంద్రీకృత అభివృద్ధికి దుర్గామాత ఆశీస్సులు కోరింది.

ట్రెండింగ్ వార్తలు

అమరావతి(Amaravati) పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ (APSJAC) అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆలయాలను సందర్శించింది. తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాల మద్దతు వీరికి ఉంది. కమిటీలోని మహిళలలు దుర్గ గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు.

జేఏసీ(JAC) అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం మరో యాత్ర ఇప్పటికే అమరావతి(Amaravati) నుండి బయలుదేరింది. కోస్తా జిల్లాల గుండా అరసవిల్లికి చేరుకుంటుంది. అక్కడ సూర్య భగవానుడి ఆలయం ఉంది. అమరావతి మాత్రమే ఏపీకి రాష్ట్రానికి రాజధానిగా కోరుకుంటున్నారు.

2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోస్తా జిల్లాల్లో అధికార పార్టీ నేతలు సొంతంగా అఖిలపక్ష సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారు. వికేంద్రీకృత అభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెబుతూ మంత్రులు, వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు ఇందులో పాల్గొంటున్నారు.

దసరా(Dasara) ఉత్సవాల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు కూడా మూడు రాజధానులకు భక్తిశ్రద్ధలతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్. వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అధికార వికేంద్రీకరణ కోసం ప్రార్థించాలని, విజయదశమి రోజున కుల, మతాలకు అతీతంగా అన్ని దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టాలన్నారు.

అమరావతిలో రాజధాని కావాలని కుట్ర పన్నిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాలంటూ దుర్గాదేవిని ప్రార్థించడానికి విజయ దశమి కంటే మంచి రోజు మరొకటి ఉండదని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. శాసన రాజధానిగా అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. అయితే రాష్ట్ర వికేంద్రీకరణ కోసం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలని ప్రార్థించారు.

WhatsApp channel