Vijayawada Gang Rape : విజయవాడ గ్యాంగ్ రేప్.. ఇద్దరు అరెస్ట్
Crime News : రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టించింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తెలిసిన వారే మహిళపై అత్యాచారం చేశారని గుర్తించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై గ్యాంగ్ రేప్(Gang Rape) జరిగిన ఘటన తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. బాధితురాలు చిన్న చిన్న పనులు చేస్తూ.. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ కింద బాలకోటి అనే వ్యక్తితో ఏడాదిగా సహజీవనం చేస్తోంది. ఆమెకు శ్రీను అనే వ్యక్తితో పరిచయం.. అతడితోపాటుగా రెండు రోజులు పనికి వెళ్లింది.
శ్రీనుతోపాటుగా.. నాగరాజు, రవి అనే మరో ఇద్దరు కూడా.. ఆమెపై అత్యాచారం చేశారు. మూడు రోజులు సనత్ నగర్ లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి.. అత్యాచారం చేశారు. మహిళా అనారోగ్యంగా ఉండటంతో బాలకోటి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీంతో అసలు విషయం అప్పుడు వెలుగులోకి వచ్చింది. వైద్యులు వెంటనే పెనమలూరు పోలీసు(Police)లకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి.. ఏడు స్పెషల్ టీమ్స్ నిందితుల కోసం గాలించారు. ఇద్దరి నిందితులను అరెస్టు చేశారు. రవి అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బాధితురాలిని తీవ్ర హింసకు గురిచేసినట్టుగా తెలుస్తోంది. నిందితులు ఆమెపై సిగరెట్లతో కాల్చినట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ ఒంటిపై గాయాలు ఎక్కువే ఉన్నాయి. నిందితులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. ఇంకా ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పూర్తిగా కోలుకున్నాక.. అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.