Tirumala : పరకామణిలో బంగారం చోరీకి యత్నం - బెడిసికొట్టిన ప్లాన్..! పట్టుబడిన బ్యాంకు ఉద్యోగి-police arrested a bank employee who tried to steal tirumala srivari parakamani gold ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : పరకామణిలో బంగారం చోరీకి యత్నం - బెడిసికొట్టిన ప్లాన్..! పట్టుబడిన బ్యాంకు ఉద్యోగి

Tirumala : పరకామణిలో బంగారం చోరీకి యత్నం - బెడిసికొట్టిన ప్లాన్..! పట్టుబడిన బ్యాంకు ఉద్యోగి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 12, 2025 12:39 PM IST

తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించి దొరికాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించింది. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్యను అదుపులోకి తీసుకుని తిరుమల వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించింది.

శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం ..!
శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం ..!

తిరుమల శ్రీవారి తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి యత్నించిన ఘటన వెలుగు చూసింది. ఏకంగా వంద గ్రాముల బిస్కెట్ బంగారాన్ని కాజేసే యత్నం జరిగింది. విజిలెన్స్ నిఘాలతో అతగాడు దొరికిపోయాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

yearly horoscope entry point

వంద గ్రాముల బిస్కెట్ బంగారం…

ప్రాథమిక వివరాల ప్రకారం… పరకామణిలో చోరికి పాల్పడుతున్న వ్యక్తిని అగ్రిగోస్ ఉద్యోగి(ఔట్ సోర్సింగ్) పెంచలయ్యగా గుర్తించారు. పరకామణి నుంచి వచ్చేటప్పుడు ట్రాలీ పైప్ లో 100 గ్రాముల బంగారాన్ని పెట్టుకొని అలయంలోకి బయల్దేరాడు. ఈ క్రమంలోనే విజిలెన్స్ సిబ్బందికి రెడ్ హ్యాండెండ్ గా పట్టుబడ్డాడు. విచారణ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఒక్కేడే ఉన్నాడా..? లేక తెర వెనక ఏవరైనా ఉన్నారా..? వంటి కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తిరుమలలో ఈ తరహా ఘటనలు జరగటం ఇదే తొలిసారి కాదు. పలువురు సిబ్బంది ఇలా చేతివాటం ప్రదర్శించి.. అడ్డంగా దొరికిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక తిరుమల క్షేత్రమంతా కూడా నిఘా క్షేత్రంలో ఉంటుంది. ప్రతి ఒక్కరి కదలికపై నిఘా ఉంటుంది.

బాధితులకు చెక్కుల పంపిణీ:

తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ్టి నుంచే (జనవరి 12) చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది.

ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా వారిని సందర్శించి ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారు.

ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరిస్తాయి. అంతే కాకుండా ఈ కమిటీ సభ్యులు తీవ్రంగా గాయపడిన భక్తులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను మరియు పాక్షికంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం