Polavaram Hydro Power Project : 2026 నాటికి పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్
Polavaram Hydro Power Project పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీజెన్‌కో గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటులో వెల్లడించారు.
Polavaram Hydro Power Project పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఎలాంటి నిదులు కేటాయించడం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటులో తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీజెన్‌కో తెలిపిందని షెకావత్ వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఏపీజెన్‌కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని షెకావత్ వివరించారు. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత నిధులతోనే జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ నిధులేమీ కేటాయించడం లేదని మంత్రి తెలిపారు.
నదుల అనుసంధానంపై డీపీఆర్‌లు పూర్తి…
దేశంలో నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గుర్తించిన మొత్తం 30 లింకులలో 8 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు పూర్తయ్యాయని జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. మరో 24 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ నివేదికలు కూడా పూర్తయినట్లు చెప్పారు.
ప్రభుత్వ నేషనల్ పర్స్‌పెక్టివ్ ప్లాన్ కింద నదుల అనుసంధానం కోసం జాతీయ జల మార్గాల అభివృద్ధి సంస్థ దేశవ్యాప్తంగా 30 లింకులను గుర్తించినట్లు చెప్పారు. లింకులన్నింటికీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుందని ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అమలు దశలో మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం, నిధుల సమీకరణ వంటి తదితర అంశాలు చర్చకు వస్తాయని పేర్కొన్నారు.