Sambara Jatara: పోలమాంబ జాతరకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు, రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహణ-polamma jatara to be celebrated with state honors in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sambara Jatara: పోలమాంబ జాతరకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు, రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహణ

Sambara Jatara: పోలమాంబ జాతరకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు, రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహణ

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 31, 2024 05:00 AM IST

Sambara Jatara: ఉత్తరాంధ్రలో జరిగే పోలమాంబ జాతరను రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 27,28,29 తేదీల్లో మూడ్రోజులపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.

పోలమాంబ జాతర పెోస్టర్‌ విడుదల చేస్తున్న మంత్రి సంధ్యారాణి
పోలమాంబ జాతర పెోస్టర్‌ విడుదల చేస్తున్న మంత్రి సంధ్యారాణి

Sambara Jatara: ఉత్తరాంధ్రలో అంగరంగవైభవంగా జరిగే పోలమాంబ జాతరను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా నిర్వహించనున్నారు. జనవరి నెలలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే శంబర పొలమాంబ జాతరకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రధాన వేడుకల అనంతరం, పండుగ తొమ్మిది వారాల పాటు కొనసాగుతుంది.

yearly horoscope entry point

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించింది. పార్వతీపురం జిల్లా నలు మూలల నుండి అలాగే పొరుగు జిల్లాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల నుండి సుమారు మూడు లక్షల మంది భక్తులు జాతరకు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. శంబర పోలమాంబ జాతర అనేది ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రసిద్ధి చెందిన పండుగ. చాలా మంది యాత్రికులు ఆరాధ్య దేవత దర్శనం కోసం వస్తారు. ఉత్తర ఆంధ్రాలో జరిగే అతి పెద్ద పండుగలలో ఇది ఒకటి.

సోమవారం మక్కువ మండలం శంబర వద్ద శంబర పొలమాంబ జాతర ఏర్పాట్లపై మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరను విజయవంతం చేసేందుకు ప్రతి అడుగు పకడ్బందీగా వేయాలని అధికారులను ఆదేశించారు. "సిరిమాను ఉత్సవం"లో ముఖ్యంగా విద్యుత్ సరఫరా సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.

పారిశుధ్యం అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని ఆమె అన్నారు. తాగునీరు ఏర్పాటు చేయాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆమె కోరారు. ప్రజలు పోలమాంబ దర్శనం చేసుకునేందుకు ప్రజా రవాణా శాఖ తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

క్యూలైన్లు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని, ఆలయానికి ఆనుకుని ఉన్న గోముఖి నది వద్ద స్నానాలు, వంటలు చేపట్టడంపై దృష్టి సారించాలని ఆమె తెలిపారు. పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. 2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు నిర్వహణ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.

జాతర నిర్వహణ కోసం ఏపీఎస్‌ ఆర్ టి సి 61 బస్సులను ఏర్పాటు చేస్తోంది. రోడ్ల మధ్యలో ఉన్న స్తంభాలను టాస్క్ కొ మార్చ నుంది. వైద్య, ఆరోగ్య శాఖ 8 వైద్య శిబిరాలకు ఏర్పాట్లు చేస్తోంది. 4 వందల మంది పారిశుధ్య కార్మికుల ఏర్పాటుతో పాటు అవసరమైన మెటీరియల్‌ను పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాటు చేస్తుంది.ఉత్సవాల నిర్వహణలో భాగంగా మంత్రి శంబర జాతర పోస్టర్ను విడుదల చేశారు.

Whats_app_banner