PM Modi Visakha Tour : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
PM Modi Visakha Tour : ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
PM Modi Visakha Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ రూ.2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ భారీ రోడ్ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో రూ.2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వర్చువల్‌గా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 3 గంటల పాటు ప్రధాని మోదీ విశాఖలో ఉండనున్నారు. అనంతరం ఆయన విశాఖ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు.
ప్రధాని పర్యటన ఇలా?
బుధవారం సాయంత్రం 4.15 గం.లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమానంలో విశాఖపట్నం చేరుకుని సా.4.45 గం.ల నుంచి 5.30 గం.ల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారు. సా.5.30 గం.ల నుంచి 6.45 గం.ల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం 6.50 గం.లకు సభా వేదిక నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.15 గం.ల విశాఖ నుంచి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళతారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో సుమారు 3 గం.ల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని... వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకూ చేరుకుంటారు.
ఏయూ గ్రౌండ్స్‌లో వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్,నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్,గుంటూరు-బిబినగర్,గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రారంభిస్తారు.
సంబంధిత కథనం