PMJJBY Scheme : పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఏడాదికి రూ.436 చెల్లిస్తే 2 లక్షల బీమా-దరఖాస్తు విధానం ఇలా?-pm jeevan jyoti bima yojana scheme 2 lakh benefits for yearly once premium ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pmjjby Scheme : పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఏడాదికి రూ.436 చెల్లిస్తే 2 లక్షల బీమా-దరఖాస్తు విధానం ఇలా?

PMJJBY Scheme : పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఏడాదికి రూ.436 చెల్లిస్తే 2 లక్షల బీమా-దరఖాస్తు విధానం ఇలా?

Bandaru Satyaprasad HT Telugu
Oct 09, 2024 01:42 PM IST

PMJJBY Scheme : పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు. 18-50 ఏళ్ల మధ్య వయస్సు గల వారు బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందవచ్చు. ఏటా రూ.436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఏడాదికి రూ.436 చెల్లిస్తే 2 లక్షల బీమా-దరఖాస్తు విధానం ఇలా?
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఏడాదికి రూ.436 చెల్లిస్తే 2 లక్షల బీమా-దరఖాస్తు విధానం ఇలా?

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బీమా ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్టాఫీసు, బ్యాంకులో ద్వారా పొందవచ్చు. ఈ స్కీమ్ ను బీమా కంపెనీలు నిర్వహిస్తాయి. ఏదైనా కారణం వల్ల పాలసీదారుడు మరణిస్తే జీవిత బీమా వర్తిస్తుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలి. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రయోజనాలు

పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద టర్మ్ ఇన్సూరెన్స్ అందిస్తారు. ఈ పాలసీదారుడికి ఏటా రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. కస్టమర్లు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో రూ.436 ప్రీమియం చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. వినియోగదారులు కావాలనుకుంటే ఆటో డెబిట్ సౌకర్యాన్ని పెట్టుకోవచ్చు. ప్రతి ఏటా నగదు ఆటో డెబిట్ అవుతాయి. ఈ పథకాన్ని పొందాలంటే పోస్టాఫీసులో లేదా బ్యాంకు ఖాతాలో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి.

ఎప్పుడు, ఎంత చెల్లించాలి?

పాలసీదారుడు రూ. 436 ప్రీమియం చెల్లించాలి. ఈ పథకం కింద జూన్ 1 నుంచి మే 31 వరకు ఏడాదిగా లెక్కిస్తారు. మొదటిసారి నమోదు చేసుకున్న వారికి, ప్రీమియం చెల్లింపు తేదీ నుంచి రిస్క్ కవర్ ప్రారంభమవుతుంది. ఖాతాదారుడు ఈ పథకంలో చేరిన మొదటి ముప్పై రోజులలోపు మరణించినా, అతనికి బీమా రక్షణ ప్రయోజనం అందిస్తారు.

అర్హతలు

సేవింగ్స్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా కలిగి ఉన్న 18-50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. 50 ఏళ్లు పూర్తి కాకుండానే పథకంలో చేరిన వ్యక్తులు ప్రీమియం చెల్లించిన తర్వాత 55 ఏళ్ల వయస్సు వరకు జీవిత బీమా కొనసాగించవచ్చు.

ఈ పథకంలో 30 రోజుల తాత్కాలిక నిబంధన ఉంటుంది. పీఎం జీవన్ జ్యోతిలో నమోదు చేసుకున్న తేదీ నుంచి మొదటి 30 రోజులలో క్లెయిమ్ కేసులు చెల్లించరు. ప్రమాదాల వల్ల మరణం సంభవిస్తే ఈ నిబంధన వర్తించదు.

దరఖాస్తు విధానం

పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని అన్ని బ్యాంకులు, పోస్టాఫీస్ ల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఈ బీమా పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో పీఎంజేజేబీవై దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి, సంబంధిత పత్రాలు అందించాలి. ఆన్ లైన్ బ్యాంకింగ్ లో క్షణాల్లో ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ బ్యాంకింగ్ లోని ఇన్యూరెన్స్ సెక్షన్ లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం