PM Internship Scheme 2024 : నెలకు రూ.5 వేలు స్టైఫండ్, పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ కు నేడే లాస్ట్
PM Internship Scheme 2024 : ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. అర్హులైన అభ్యర్థులు pminternship.mca.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలుచేస్తుంది.
నెలకు రూ.5 వేలు స్టైఫండ్, పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ కు నేడే లాస్ట్
రానున్న ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024' దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పీఎం ఇంటర్న్ షిప్-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటితో(నవంబర్ 10) ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు https://pminternship.mca.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇస్తారు.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ అర్హతలు
- దరఖాస్తుదారుడు వయోపరిమితి 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్ రోల్ అయ్యి ఉండకూడదు. ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అభ్యసించవచ్చు. అలాగే ప్రస్తుతం పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు.
- దరఖాస్తుదారుడి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు లేదా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు.
- దరఖాస్తుదారు హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్ లేదా ఐటీఐ అర్హత కలిగి ఉండాలి లేదా BA, BSc, BCom, BCA, BBA, BPharma మొదలైన వాటిలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా కలిగి ఉండాలి.
- పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్-2024 దదరఖాస్తుకు భారతీయములు మాత్రమే అర్హులు.
- ఇంటర్న్‌లకు 12 నెలల పాటు దేశంలోని టాప్ కంపెనీలలో పనిచేసే అవకాశం లభిస్తుంది. వారు ప్రభుత్వం నుంచి నెలవారీగా రూ.4,500, కంపెనీ నుంచి రూ.500 స్టైఫండ్ అందుకుంటారు. అలాగే రూ.6,000 వన్-టైమ్ గ్రాంట్‌కు కూడా అర్హులు. ప్రతి ఇంటర్న్ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీకి అర్హులు.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 దరఖాస్తు విధానం ఇలా?
- అర్హులైన అభ్యర్థులు ముందుగా https://pminternship.mca.gov.in/ వెబ్ సైట్ కి వెళ్లండి.
- రిజిస్టర్ నౌ లింక్‌పై క్లిక్ చేయండి.
- మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థుల సమాచారం ఆధారంగా రెజ్యూమ్ రూపొందిస్తారు.
- ఐదు ప్రాధాన్యత అంశాలు లోకేషన్, సెక్టార్, ఫంక్షనల్ రోల్, అర్హతలు...ఆధారంగా ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి
- దరఖాస్తును సబ్మిట్ చేసి, తదుపరి ఉపయోగం కోసం హార్డ్ కాపీని తీసుకోండి.
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకం 2024 కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు రుసుము లేదు.
సంబంధిత కథనం