Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో ఘోరం, దివ్యాంగురాలిపై అత్యాచారం...గర్భం దాల్చిన యువతి
Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపైఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రాజీ ప్రయత్నాలు మొదల పెట్టాడు. యువతి నాన్నమ్మ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని ఒక గ్రామంలో దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి కుటుంబ సభ్యులు తెలిపి వివరాల ప్రకారం వరిశి భాస్కరరావు ఆ ఊరులో పెద్ద మనిషి తరహాలో ఉన్నారు. రాజకీయాల్లో తిరుగుతున్నాడు.
తల్లిదండ్రులు కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లడంతో దివ్యాంగురాలైన యువతి (20) తన నాయనమ్మ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఆమె వరిశి భాస్కరరావు ఇంట్లో పని చేసేందుకు వెళ్లేది.
ఇంట్లో పని చేసేందుకు ప్రతి రోజూ ఆ యువతి రావడంతో ఆమెపై భాస్కరరావు కన్నేశాడు. దీంతో ఆమెను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. ఈ క్రమంలో ఆ దివ్యాంగు యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. గత కొంత కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆమె గర్భం దాల్చడంతో బయటపడింది.
ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో యువతి నాన్నమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి ఆమె గర్భం దాల్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆ దివ్యాంగు యువతి ఏడు నెలల గర్భిణిగా ఉంది. గర్భం దాల్చడానికి కారణమేంటని యువతి నాయనమ్మ ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని వివరించింది.
దీంతో తన మనుమరాలికి న్యాయం జరగాలని ఇతర కుటుంబ సభ్యులతో కలిసి యువతి నాన్నమ్మ భాస్కరరావు వద్దకు వెళ్లింది. బాధిత యువతి కుటుంబ సభ్యులు భాస్కరరావును నిలిదీశారు.
రాజీకి ప్రయత్నాలు..
ఈ వ్యవహారం నుంచి ఎలాగైనా బయటపడాలనుకుని పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే దీనికి బాధిత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలో బాధితురాలు కాశీబుగ్గు పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్తే, తన మనవరాలు గర్భవతి అని తెలిసినట్లు యువతి నాన్నమ్మ తెలిపారు. వరిశి భాస్కరరావు తన మనవరాలిని గర్భవతిని చేశాడని ఆమె అన్నారు.
తమకు అన్యాయం జరిగిందని, న్యాయం జరగాలని కోరుకుంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ డిమాండ్ చేస్తుంది. అయితే తన రాజకీయ బలంతో పోలీసులను మేనేజ్ చేసేందుకు భాస్కరరావు ప్రయత్నిస్తున్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపింది. తమ కుమార్తెకు ఇలా జరిగిందని తెలిసిన తరువాత, హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులు వెంటనే స్వగ్రామానికి చేరుకున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం