Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గత వారం సింగపూర్‌లోని టమాటో కిచెన్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ అరకు పర్యటనలో ఉన్నారు. చికిత్స తర్వాత శనివారం రాత్రి సింగపూర్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో కుమారుడు సురక్షితంగా ఉండటంతో పవన్ సతీమణి మొక్కులు తీర్చుకోడానికి ఆదివారం రాత్రికి తిరుమల చేరుకున్నారు. తిరుమలలో టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేవారు. అనంతరం శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుని పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు.
గత వారం సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అన్నా కొణిదల మొక్కుకున్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి. శనివారం అర్థరాత్రి సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్, అన్నాలు పిల్లలతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఈ క్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకొనేందుకు శ్రీమతి అన్నా కొణిదల గారు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ నిబంధనలు అనుసరిస్తూ - గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం తరవాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.
సోమవారం వేకువజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందించారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.
సంబంధిత కథనం