Pawan Kalyan Son : సింగపూర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న మార్క్ శంకర్, ఫొటో వైరల్-pawan kalyan younger son mark shankar recovering in singapore hospital viral photo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan Son : సింగపూర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న మార్క్ శంకర్, ఫొటో వైరల్

Pawan Kalyan Son : సింగపూర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న మార్క్ శంకర్, ఫొటో వైరల్

Pawan Kalyan Son : సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఫొటో వైరల్ అవుతుంది. ఆక్సిజన్ మాస్క్, చేతికి కట్టుతో మార్క్ శంకర్ ఉన్నాడు. తన కుమారుడు కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ తెలిపారు.

సింగపూర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న మార్క్ శంకర్, ఫొటో వైరల్

Pawan Kalyan Son : సింగపూర్ సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బ్లాక్ స్మోక్ పీల్చడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అనంతరం పవన్ కల్యాణ్ , చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అయితే తాజాగా మార్క్ శంకర్ ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. ఆక్సిజన్ మాస్క్, చేతికి కట్టుతో ఉన్న బాలుడి ఫొటో వైరల్ అవుతుంది.

అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేం లేదని, క్షేమంగానే ఉన్నారని పవన్ కల్యాణ్, చిరంజీవి తెలిపారు. మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగిందని తెలిసి ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ తో ఫోన్ లో మాట్లాడారు. పవన్ కు ధైర్యం చెప్పారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.

అగ్ని ప్రమాదం వీడియోలు వైరల్

మార్క్ శంకర్‌కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి శంకర్‌ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు అయ్యాయని, పొగ పీల్చడంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డు నుంచి మరో రూమ్ కు బాలుడిని షిఫ్ట్‌ చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. మార్క్ శంకర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పిఠాపురంలోని పదో శక్తిపీఠం పాదగయ క్షేత్రం ఆలయ ప్రాంగణంలో జనసేన నాయకులు కార్యకర్తలు మృత్యుంజయహోమం నిర్వహించారు. సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం చాలా బాధాకరం.

సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని విశాఖ జనసేన నాయకులు, కార్పొరేటర్లు, జనసైనికులు, వీర మహిళలు వెంకోజీపాలెం శ్రీ వీర ఆంజనేయస్వామి వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మార్క్ శంకర్ త్వరగా కోరుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం