Janasena Pawan : జనసేన రౌడీ సేన కాదు విప్లవసేన….పవన్ కళ్యాణ్-pawan kalyan says bjp permission not required to fight against ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pawan Kalyan Says Bjp Permission Not Required To Fight Against Ysrcp

Janasena Pawan : జనసేన రౌడీ సేన కాదు విప్లవసేన….పవన్ కళ్యాణ్

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 01:13 PM IST

Janasena Pawan రాష్ట్రంలో ఎవరు అధిక సంఖ్యాకులు అధికారంలో ఉండాలన్నది తన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ సందర్భంగా ఇళ్లు కోల్పోయిన వారికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సమావేశానికి భూమి ఇచ్చారనే కోపంతో ఇళ్లు కూల్చి వేశారని ఆరోపించారు. ఇప్పటం గ్రామ ప్రజల గడపలు కూల్చేసిన వైసీపీ ప్రభుత్వ గడప కూల్చేస్తానని పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. తాను యుద్ధం చేయాలనుకుంటే బీజేపీని అడిగి చేయనని, తన మీద చాడీలు చెప్పుకున్నా ఇబ్బంది లేదన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌

Janasena Pawan Kalyan : ఇప్పటం గ్రామంలో గడపలు కూల్చినందుకు వైసీపీ గడప కూల్చేవరకు పోరాడతానని పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి తాను రాలేదని ప్రజల కన్నీళ్లు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా తాను చేయగలిగింది ఎప్పుడు చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సాయం చేస్తానని చెప్పడం కాదని, తన వంతుగా చేతనైనా సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పటం ప్రజలకు సాయం చేస్తున్నట్లు చెప్పారు. తనకు అండగా ఉన్న కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆర్ధిక సాయం చేస్తున్నట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన పార్టీ సమావేశానికి ఇచ్చారనే ఏకైక కారణంతో విచక్షణా రహితంగా ఇళ్లు కూల్చారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరికి ఒకే రకమైన నిబంధనలు ఉండాలన్నారు. ప్రజల కష్టాల్లో తాను అండగా ఉంటానని, ఇప్పటం గ్రామ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటం గ్రామ ప్రజలు చూపిన తెగువ అమరావతి ప్రజలు కూడా చూపించే ఉంటే బాగుండేదన్నారు. 39కుటుంబాలకు జనసేన వంతుగా లక్ష రుపాయలు ఇస్తున్నట్లు చెప్పారు.

డీఫ్యాక్టో సిఎంగా సజ్జల…

రాష్ట్రంలో అహంకార పూరిత రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్‌ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి డిఫ్యాక్టో సిఎంగా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. తనను తిట్టించినా పర్లేదని, ఉడత ఊపులకు జనసేన భయపడదన్నారు. జనసేనకు అండగా ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడితే 24లో వచ్చే జనసేన ప్రభుత్వం, తమ వారి ఇళ్లను ఎలా కూల్చారో, తాను కూడా చట్టబద్ద పద్ధతుల్లోనే వైసీపీ మాజీ ఇళ్లను కూల్చి వేస్తానని చెప్పారు. వైసీపీ వారొక్కరే రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, దీనికి ముగింపు పలుకుతానన్నారు. కోడి కత్తి డ్రామాలు అన్ని వేళలా పనికి రావన్నారు. వైసీపీ వారికి సంస్కారం పనికి రాదన్నారు. మంచి మర్యాద పనిచేయదని, మనిషికో మాట, గొడ్డుకో దెబ్బలా వారితో వ్యవహరించాలన్నారు.

వైసీపీ నాయకుడు జనసేన కాదు రౌడీసేన అన్నారని, వివేకానంద రెడ్డిని హత్య చేయించి, హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చినప్పుడే వారి శైలి అర్థం ప్రజలకు అర్థమైందన్నారు. వైసీపీలో తోలుమందం నాయకులు ఎక్కువయ్యారని విమర్శించారు. ఎల్లప్పుడూ హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే చెల్లుబాటు కాదన్నారు. వైసీపీ రాజకీయ పార్టీనా టెర్రరిస్ట్‌ పార్టీనా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. తనకు ఓట్లు వేసినా, ఓట్లు వేయకపోయినా తాను ప్రజలు అండగా నిలబడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

రాష్ట్రంలో తామొక్కరే రాజకీయాలు చేయాలనే భావనలో వైసీపీ నాయకులు ఉన్నారని, రాజకీయం తామెందుకు చేయకూడదని పవన్‌ ప్రశ్నించారు. ఫ్యూడల్ కోటలు బద్దలు కొడతామని ప్రకటించారు. వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు బెదరమన్నారు. వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ప్రజల కన్నీళ్లపై కడుసతున్న ఫ్యూడల్ కోటల్ని కూల్చివేసే సమయం ఎంతో దూరంలో లేదన్నారు.

వైసీపీ రాజకీయా పార్టీనా, వైసీపీ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషనో చెప్పాలని పవన్ కళ్యాణ్‌ డిమాండ్ చేశారు. తమకు అండగా నిలబడే వారిని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయం తామెందుకు చేయకూడదని, రాజకీయాలకు పెట్టిపుట్టాలా అని నిలదీశారు. ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతామన్నారు.

బీజేపీని అడిగి యుద్ధం చేయను…

ఇప్పటం కూల్చివేత వెనుక సజ్జల పాత్ర ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సజ్జల, వైసీపీ నేతలది ఆధిపత్య అహంకారమని, వైసీపీ నేతల దాడులకు జనసేన భయపడదన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని ప్రకటించారు. వీధి రౌడీలతో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసని, వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతామన్నారు. అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, 2024 కీలకమైన ఎన్నికలన్నారు. ప్రధానితో ఏం మాట్లాడామో సజ్జలకు ఎందుకు చెప్పాలన్నారు. ప్రధానితో ఏం మాట్లాడానో తన దగ్గరకు వస్తే చెవిలో చెబుతానన్నారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనని తానే కొడతానన్నారు. యుద్ధం తానే చేస్తానన్నారు. సజ్జలకు సవాల్ విసురుతున్నానని వైసీపీ నాయకులు ఎలా గెలుస్తారో చూస్తామన్నారు.

వైసీపీ నాయకులకు వికృతమైన ఆలోచనలు లేకపోతే తన కులం వాళ్లతోనే తనను ఎందుకు తిట్టిస్తున్నారన్నారు. 2024 కీలకమైన ఎన్నికలని, 24 తర్వాత కూడా వస్తామని కలలు కంటున్నారని అలా జరగనివ్వనన్నారు. ఢిల్ల వెళ్లి చాడీలు చెప్పే అలవాటు తనకు లేదని, తన పోరాటం ఎలా చేయాలో తనకు తెలుసన్నారు. బీజేపీని అడిగి యుద్ధం చేయనని పవన్ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.

IPL_Entry_Point

టాపిక్