Pawan on Allu Arjun: అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో పవన్ స్పందన.. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్య
Pawan on Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ‌్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన పవన్ ఘటన జరిగిన వెంటనే క్షమాపణలు చెప్పి బాధితుల్ని పరామర్శించి ఉండాల్సిందన్నారు.
Pawan on Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సోమవారం ఉదయం గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ తో భేటీ అయ్యారు. త్వరలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు ప్రచారం జరిగింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపు అంశంపై చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మరోవైపు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, తర్వాత జరిగిన పరిణామాలప పవన్‌కళ్యాణ్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్ మాట్లాడిన పవన్ సినీ పరిశ్రమకు రేవ్ంత్ సహకరిస్తున్నారని చెప్పారు. స్పెషల్ షోలు, సినిమా టిక్కెట్ల ధరల పెంపుకు అన్ని విధాలుగా సహకరించారని అభిప్రాయ పడ్డారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించిందని గుర్తు చేశారు.
ఈ విషయంలో ఏమి చేయాలన్నా రెండు వైపులా పదునైన కత్తి వంటి పరిస్థితిని రేవంత్ ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ సిబ్బంది ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. చివరకు గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్టైందన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చి ఉండాల్సిందన్నారు. అల్లు అర్జున్ స్టాఫ్, థియేటర్ యాజమాన్యం ఏర్పాట్లపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
అల్లు అర్జున్ కాకుండా ఆ స్థానంలో ఎవరు ఉన్నా రేవంత్ రెడ్డి ఇదే మాదిరి ప్రవర్తించి ఉండేవారన్నారు. సారీ చెప్పడానికి కూడా చాలా పద్దతులు ఉంటాయనని పవన్ వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించి ఉండాల్సిందన్నారు. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటారో తెలుసుకోవాలని భావిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల మధ్య అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందన్నారు.