Delhi Election Results : ఢిల్లీలో బీజేపీ విజయం శుభపరిణామం.. పవన్‌ కల్యాణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!-pawan kalyan interesting comments on bjp victory in delhi assembly elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Delhi Election Results : ఢిల్లీలో బీజేపీ విజయం శుభపరిణామం.. పవన్‌ కల్యాణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Delhi Election Results : ఢిల్లీలో బీజేపీ విజయం శుభపరిణామం.. పవన్‌ కల్యాణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 08, 2025 03:09 PM IST

Delhi Election Results : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగిరింది. ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు పుల్‌స్టాప్ పడింది. పలువురు ఆప్‌ అగ్ర నేతలు ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఈ ఫలితాలపై తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌
పవన్‌ కల్యాణ్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఢిల్లీలో మోదీ డబుల్‌ ఇంజిన్‌ నినాదం పనిచేసింది. లిక్కర్‌ స్కామ్‌, అవినీతి ఆరోపణలు ఆప్‌ కొంపముంచాయి. ఎన్నికలవేళ ఆమ్‌ఆద్మీ పార్టీని సీనియర్‌ నేతలు వీడారు. అటు ఓటర్లపై యమునా నది కాలుష్యం తీవ్ర ప్రభావం చూపింది. యమునా కాలుష్యానికి కేజ్రీవాలే కారణమని బీజేపీ క్యాంపెయిన్ చేసింది. ఢిల్లీ ప్రజలను బీజేపీ గ్యారంటీలు ఆకట్టుకున్నాయి. దీంతో దళిత, ఓబీసీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఆప్‌, కాంగ్రెస్‌ విడిగా పోటీచేయడంతో బీజేపీ లాభపడింది.

ఇది శుభపరిణామం..

తాజా ఎన్నికల ఫలితాలపై రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీ ఫలితాలు మోదీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం. మోదీ లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకం. ఢిల్లీలో బీజేపీ విజయం శుభపరిణామం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ద్వారానే అభివృద్ధి సాధ్యం. బీజేపీ హామీలను ప్రజలు నమ్మారు. మిత్రపక్ష నాయకులకు అభినందనలు' అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

హజారే రియాక్షన్..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారని విశ్లేషించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయయన్న హజారే.. లిక్కర్‌ స్కామ్‌తో కేజ్రీవాల్‌ అప్రతిష్ఠపాలయ్యారని వివరించారు. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారని అన్నా హజారే వ్యాఖ్యానించారు.

బండి కామెంట్స్..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్రజలు కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు. కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామన్న బండి.. ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని వివరించారు. తెలంగాణలోను అధికారంలోకి వస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

కేటీఆర్ ట్వీట్.. పొన్నం కౌంటర్..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్‌పై మంత్రి పొన్నం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్‌కు లోలోపల సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా.. బీజేపీ గెలుపు కేటీఆర్‌కు ఆనందం కలిగించినట్టు ఉందని.. కేసుల మాఫీ కోసమే కేటీఆర్‌ బీజేపీ భజన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.

Whats_app_banner